పుట:1857 ముస్లింలు.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఖండిత శరీరాలను నాలుగుసార్లు తొలగించి కొత్తవారిని ఎక్కించాల్సి వచ్చింది...తిరగబడ్డ వారందరినీ అధికారులు కఠినంగా శిక్షించారు...51వ సైనికదళం సాయంత్రానికల్లా నాశనమైంది. మూడు గోతులు తవ్వి 700 మంది శవాలను పారేశారు. (1857 మనం మరచిన మహాయుద్ధం, ఎం.వి.ఆర్‌.శాస్రి, దుర్గాపబ్లికేషన్స్‌ , హెదారాబాద్‌, 2007, పేజి.1)

ఈ లేఖల ద్వారా, అధికారుల నివేదికల ద్వారా ఆంగ్లేయుల క్రూర క్రీడ వినోద మనస్తత్వంతో పాటుగా మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్నయోధులు మృత్యువుకు ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా, మరెంతో నిబ్బరంగా ఉన్న వాస్తవం కూడా వెల్లడవుతుంది. విముక్తి పోరాటంలో పాల్గొన్న తాము సైనిక యోధులం కనుక తమను నేరస్థుల్లా ఉరితీయడం, ఫిరంగులతో పేల్చి వేయడం కాకుండా యుద్ధ వీరుల్లా తుపాకులతో కాల్చివేయమని మాత్రమే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులు కోరారు తప్ప, వారెన్నడూ క్షమాభిక్షను గాని ప్రాణభిక్షను గాని అర్థించకపోవటం భారతీయులంతా అత్యంత విషాదంలో కూడా తమ పూర్వీకుల మాతృదేశభక్తి, ధైర్యసాహసాలను స్మరించుకుంటూ గర్వించదగిన అంశం.

ఉరితీతల పరంపర

పరాయి పాలకుల మీద తిరగబడ్డ యోధులకు విధించిన ఉరిశిక్షలను కూడా ఆంగ్లేయులు చాలా క్రూరంగా నిర్వహించారు. అనుమానం వచ్చిన ప్రతివారినీ పట్టుకురావటం, తూ..తూ మంత్రంగా విచారణ జరపటం, వెంటనే ఉరిశిక్షప్రకటించటం, ఆ మరుక్షణమే ఉరిశిక్షలను అమలు చేయటం యధేచ్ఛగా సాగింది. ఈ విధంగా సాగిన ఉరితీతల పరంపరకు అంతులేకుండా పోయింది. ఢిల్లీ నగరంలో అప్పటికప్పుడు సిద్ధం చేసిన ఉరివేదికల మీద శిక్షలు అమలు జరిపితే తిరుగుబాటు దారులు విజృంభించిన మిగిలిన ప్రాంతాలలో, తిరుగుబాటు యోధులకు ఆశ్రయం కల్పించిన గ్రామాలలో, ఆంగ్లేయులకు ఆశ్రయం కల్పించ నిరాకరించిన చోటల్లా స్థానిక ప్రజల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ భయానక రీతిలో ఉరిశిక్షల క్రౌర్యాన్నిసాగించారు.

ఉరిశిక్ష విధించేందుకు ప్రత్యేకంగా నిర్దేశించబడిన విధానాలను మాత్రమే కాకుండ కొత్త కొత్త పద్ధతులను అప్పటికప్పుడు అమలుచేశారు. చెట్లను నరికి వచ్చిన కలపతో ఉరివేదికలను తయారు చేయటం మాత్రమే కాకుండా నేరుగా చెట్లనే

216