1857: ముస్లింలు
సమయంలో తమ భవంతుల దార్వాజాలను బిగించుకుని, తమ వీధుల ద్వారాలను కూడా పూర్తిగా బంద్ చేసి అటు ఆంగ్లేయులకు గాని ఇటు తిరుగబడిన యోధులకు కాని ఏమాత్రం సహాయం-సహకారం అందించకుండా తమమానాన తాము మే 11 నుండి సెప్టెంబరు 20 వరకు గడిపిన ముస్లిం కుటుంబాలు కూడా ఆంగ్ల సైనికుల దాస్టీకాల బారిన పడక తప్పలేదన్న సమాచారం పుష్కలంగా ఉంది.
- ఫిరంగి గోట్టాలకు కట్టి పేల్చివేతలు
స్వాతంత్య్ర సంగ్రామ యోధులను అంతం చేయడానికి ప్రధానంగా మూడు విధానాలను ఆంగ్ల సైన్యాలు అనుసరించాయి. అవి ఉరితీతలు, ప్రత్యేక దాళాల చేత తుపాకులతో కాల్చి చంపటం, ఫిరంగులకు కట్టిపేల్చివేయటం. ఆంగ్ల సేనలకు ఆహుతైన తిరుగుబాటు వీరులను అటు కాల్చివేసేందుకు, ఇటు ఉరితీతలకు, ఇంకోకవైపున పేల్చివేతలకు సరిపడా సామగ్రి, ఉరికంబాలు, ఫిరంగులు అందుబాటులో లేనందున జట్లు జట్లుగా యోధులను ఆంగ్లేయులు బలిచ్చారు.
ఈ విధంగా తిరుగుబాటు యోధులను తుదట్టించిన దుస్సంఘటనలు పెషావర్, అలహాబాద్, ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, ఫతేపూర్, కాన్పూరు, లక్నో, హైదారాబాద్ తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున జరిగాయి. అత్యధిక సంఖ్యలో తిరుగుబాటు యోధులను ఫిరంగులకు కట్టి పేల్చివేశారు. తిరుగుబాటు పూర్తి స్థాయిలో విస్తరించక ముందే ఆంగ్లేయుల ఆజ్ఞలు ఖాతరు చేయకుండిన స్వదేశీ సిపాయీలను ఫిరంగి గొట్టాలకు కట్టి పేల్చివేయడంతో ఆరంభించిన ఆంగ్ల సైనికాధికాలు తిరుగుబాటును అణిచి వేశాక ఆ దుష్కార్యాన్ని మరింత భారీ స్థాయిలో కొన సాగించారు.
ప్రజల మీద విరుచుకు పడ్డ ఆంగ్ల సైనికులు, తమకు పట్టుబడిన వారిలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారి మీద పేల్చివేతలకు పాల్పడ్డారు. ఈ కార్యక్రమం భారీ సంఖ్యలో పెషావర్, ఫరోజ్‌పూర్, కాన్పూరు, లక్నో, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలలో
నిర్వహించారు. తిరుగుబాటు యోధులను జట్లు జట్లుగా తెచ్చి ఫిరంగులకు కట్టి
పేల్చివేయటం ఆంగ్లేయాధికారులకు ఒక వినోద క్రీడగా మారింది. ఈ చర్యవలన మృత్యువాత పడిన యోధులు చివరి క్షణాలలో పడే బాధను, వ్యథను, ఫిరంగులతో పేల్చివేయటం వలన యోధుల శరీర భాగాలు ఎంతెంత దూరంగా విసిరేయబడ్డయో ఆతీరును, ఆ పేల్చివేతతో రక్తసిక్తమైన ఆ ప్రాంతం ఎంత భయానకంగా కన్పించిందీ,
214