పుట:1857 ముస్లింలు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రధారులు తదితర వివరాలను సంక్షిప్తంగా వివరించాను. రెండు, మూడు, నాల్గవ అధ్యాయాలలో వరుసగా మహిళలు, మౌల్వీలు, నాటి కలం యోధులు-పత్రికలు నిర్వహించిన పాత్రను కొంత విస్తారంగా పేర్కొన్నాను. ఐదవ అధ్యాయంలో 1857లో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు సాగించిన పోరాటాన్ని వివరించాను. ఈ చారిత్రాత్మక పోరాటంలో ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా హిందూ - ముస్లిం జనసముదాయాలలో వెల్లివిరిసిన అద్వితీయ ఐక్యతను ఆరవ అధ్యాయంలో, ఆ సందర్భంగా ఆంగ్లేయులు ప్రదర్శించిన రాక్షసత్వాన్ని ఏడవ అధ్యాయంలో తెలియచేశాను. ఆనాడు వలసపాలకుల విూద ఉమ్మడి పోరాటం జరిపిన యోధుల బిడ్డల పరిస్థితులను, ఆంగ్లేయులకు వత్తాసుగా విద్రోహానికి పాల్పడిన విభీషణ మనస్కులైన ద్రోహుల వారసులు అందలాలెక్కి భోగభాగ్యాలను అనుభవిస్తున్న వాస్తవాన్ని ఎనిమిదవ అధ్యాయంలో వివరించగా, తొమ్మిదవ అధ్యాయంలో అలనాటి యోధుల త్యాగాలు ఎందుకు విస్మరణకు గురవుతున్నాయన్న విషయాన్ని చర్చకు అవకాశం కల్పిస్తూ పాఠకుల ముందుంచాను.
ఈ విధంగా తొమ్మిది అధ్యాయాలుగా విడగొట్టబడి సాగిన గ్రంథ రచనలో కొన్ని విషయాలను చర్చించేటప్పుడు ఆ సమాచారాన్ని మరింత పరిపుష్టం చేసి, పాఠకులకు సమ్రగ దృష్టి కలుగజేసే ప్రయత్నంలో పునరుక్తి అక్కడక్కడా తప్పలేదు. అలాగే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో అమరగతిని పొందిన యోధులకు సంబంధించిన సమాచారం గతంలోని నా గ్రంథాల ద్వారా తెలుగు పాఠకులకు అందించి ఉన్నాను కనుక '1857 : ముస్లింలు' గ్రంథంలో ఆ వివరాలను ఇవ్వలేదు.
ఈ గ్రంథంలో చేర్చిన పలు చిత్రాలు, పోటోలు వివిధ వెబ్‌సైట్‌లు, భారత ప్రభుత్వం ప్రచురించిన పలు పుస్తకాలు మరియు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గ్రంథం నుండి సమకూర్చుకొన్నాం. సమరయోధుల కొన్ని చిత్రాలను ఆంగ్లేయ అధికారులు తమ గ్రంథాలలో పేర్కొన్న వర్ణనలను బట్టి ఊహించి ప్రముఖ చిత్రకారుల సహకారంతో రూపొందించడం జరిగింది.
ఈ పుస్తక రచనకు అవసరమగు విశేష సమాచారాన్ని సేకరించటంలో చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆ శ్రమను చాలా మేరకు తగ్గిస్తూ బహుగ్రంథ రచయిత Prof. Shamshul Islam ( Delhi University, Delhi) ప్రధానంగా తోడ్పాటునిచ్చారు. నా రచనలను స్వయంగా పరిశీలించటమే కాకుండా అవసరమగు గ్రంథాలను సూచించి, ఆ గ్రంథాలు లభ్యంకాక నేను అవస్థలు పడుతుంటే, వ్యయ ప్రయాసల కోర్చి, ఆ