పుట:1857 ముస్లింలు.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గ్రంథాలను వివిధ ప్రాంతాల నుండి తాను స్వయంగా సేకరించి నాకు అవసరమగు భాగాలను జిరాక్స్‌ కాపీలు తీయించి పంపించడమే కాకుండా, తన స్వంత గ్రంథాలయం లోని గ్రంథాలను, తాను సేకరించిన పలు విలువైన చరిత్ర పత్రాలను కూడా జిరాక్స్‌ తీయించి ఇచ్చారు.
అదే విధంగా Baba Saheb Bhimrao Ambedkar Central University
Lucknow చెందిన చరిత్ర శాఖాధిపతి Mr.Mahaboob Basha ఎంతో వ్యయప్రయాసల కోర్చి పలు ప్రాంతాల నుండి నాకు అవసరమగు, నాకు అవసరమని తాను భావించిన గ్రంథాలను సేకరించి, మరికొన్ని అమూల్య గ్రంథాలనూ, హిందీ, ఆంగ్ల భాషలలోని పలు పత్రికలను జిరాక్స్‌ తీయించి పంపి సమాచార సేకరణలో నాకెంతో తోడ్పాటు నందించారు.
నేను సభ్యత్వం కలిగియున్న ్Centre For Study of Society and Secularism (Mumbai), నాకు పరిచయం ఉన్న Indian Association of Muslim Social Scientists (New Delhi), Institute of Objective Studies (New Delhi) లాంటి సంస్థల నుండి కూడా చాలా ఉపయుక్తమగు సమాచారం లభించింది. Jawahar Lal Nehru University (New Delhi), Alighar Muslim University (Alighar) ల గ్రంథాలయాల నుండి చాలా సమాచారం సమకూర్చుకున్నాను. సమాచార సేకరణలో మద్రాసులోని కన్నెమరా గ్రంథాలయం, విజయవాడలోని Ram Mohan Free Library & Readig Room, గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయం, వినుకొండ లోని శాఖా గ్రంథాలయం, హైదరాబాదు, అలీఘర్‌, ఢిల్లీ, మద్రాసు, బొంబాయి, పాట్నా, వేటపాలెం, రాజమండ్రి తదితర ప్రాంతాలలో గల పలు గ్రంథాలయాల అధికారులు, సిబ్బందీ నాకెంతో సహకరించారు.
ఈ పుస్తకానికి ప్రమాణవాక్యం రాసిచ్చి Prof. I. Thirumali, Head of the
Department of History, Sri Venkateswra College, Delhi University (Delhi) నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (లక్నో) చరిత్ర శాఖాధిపతి మహబూబ్‌ బాషా పరిచయవాక్యం రాసివ్వడమే కాకుండా పుస్తకాన్ని విమర్శనాత్మక దృష్టితో చదివి అవసరం అన్పించిన మార్పులు చేర్పులను కూడా సూచించారు.
ఈ విధంగా నాకు అన్ని విధాల సహకరించిన-ప్రోత్సహించిన పెద్దలు,