పుట:1857 ముస్లింలు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచయిత మాట

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
వినుకొండ-522647
గుంటూరు జిల్లా
సెల్‌ : 94402 41727

ప్రథమస్వాతంత్య్ర సంగ్రామం జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూటాయాభై సంవత్సరాల సంబరాలను జరపాలని నిర్ణయించాయి. ఈ మేరకు వార్తలు, కార్యక్రమాల వివరాలు వెలువడ్డాయి. ఆ సందర్భంగా ఒకరోజు 'తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌' (హైదరాబాద్‌) కార్యాలయంలో కూర్చోని, ఇతర మిత్రులతో కలసి స్కూల్‌ ద్వితీయ సంవత్సరం ప్రణాళికను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం.
ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ 150 సంవత్సరాల సంబరాల గురించి యథాలాపంగా మాట్లాడుకుంటుండగా, 1857 విూద ఒక ప్రత్యేక సంచిక తీసుకు వస్తే బాగుంటుందని 'గీటురాయి' వారపత్రిక బాధ్యులు అబ్దుల్‌ వాహెద్‌ తన ఆలోచనను మిత్రుల ముందుంచి, ఆర్టికల్స్‌ పరంగా సహకరించాల్సిందిగా నన్ను కోరారు. కాదనేముంది. ఆ సమయంలో మాతోపాటు సమావేశంలో ఉన్న 'తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌' సంచాలకులు అబ్బాదుల్లా తక్షణమే స్పందిస్తూ 1857లో ముస్లింల పాత్ర విూద గ్రంథం కూడా తెస్తే బాగుంటుందన్నారు. గీటురాయి కోసం రాయబోయే సమాచారాన్ని గ్రంథంగా ప్రచురిద్దాం అన్నారు. ఆ ప్రస్తావనతో నా బాధ్యత మరింత ఎక్కువయ్యింది.
ఆ సమావేశంలో సాగిన చర్చల ఫలితమే ఇప్పుడు విూ చేతుల్లో ఉన్న 1857ః ముస్లింలు. ఈ గ్రంథాన్ని మొత్తంగా తొమ్మిది అధ్యాయాలుగా విభజించాను. మొదటి అధ్యాయంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభం నుండి అంతం దాకా పూర్తి కథనాన్ని ఒక వరుస క్రమంలో, ఆయా సంఘటనలు, ఘట్టాలు, ఆయా ఘట్టాలలోని