పుట:1857 ముస్లింలు.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ముల్లాలను సంప్రదించడం మంచిదని చక్రవర్తికి సలహా ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఆయన సలహాను కొట్టిపారేసిన చక్రవర్తి అతని మీద ఆగ్రహం వెలిబుచ్చారు. చివరకు '..పండగ సందర్బంగా నగరంలో గోవులను ఖుర్భాని ఇవ్వరాదు. మహమ్మదీయుడెవరైనా అటువంటి సాహసానికి పూనుకుని గోవధచేసినా, గోవధ చేయడానికి సహకరించినా, అటువంటి వారిని ఫిరంగి గొట్టానికి కట్టి పేల్చివేయటం జరుగుతుంది' అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఆజ్ఞలు జారీచేశారు.

చక్రవర్తి అభీష్టం మేరకు ఆయన ఆదేశాల అమలు కోసం, ఆ ఆదేశాల ఉల్లంఘన ఏమాత్రం జరగకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సర్వసైనాని భక్త్‌ఖాన్‌ 1857జూలై 30న సర్వసైన్యానికి, అధికారులకు హుకుంనామా జారీ చేశారు. ఆంగ్లంలో ఆ హుకుంనామా ఈ క్రింది విధంగా ఉంది. Seal Court of Valiant Commander-in-Chief

Order To all officers of Platoon and Regiments of the gate of the city whereas it is not acceptable to His Majesty that there should be any incident of cow slaughter in the City, therefore in order to make arrangements for implementation thereof orders are issued to all the above that with effect from today to the 10th Zilhij 21R.Y the Sunday, Iduz Zuha, no butcher should be allowed to bring in a cow or bull into city with the intent to commit such an act. Otherwise take care that no one should commit such an act. Treat it as imperative. Dated 8 Ziljij, 21(R.Y)

ఫలించని ఆంగ్లేయుల ఎత్తులు

ప్రజల మత మనోభావాలను గౌరవించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ మత మనోభావాలకు విఘాతం కల్గించే పనులకు పాల్పడవద్దని ప్రజలను చక్రవర్తి స్వయంగా కోరారు. బహదూర్‌ షా జఫర్‌ స్వయంగా ఈద్గా దగ్గర గోవును కాకుండ గొర్రెను ఖుర్బాని ఇచ్చి అందరికి మారదర్శ కయ్యారు. చక్రవర్తి ప్రవర్తనతో ప్రబావితులైన ముస్లింలు గొర్రెలను ఖుర్బాని ఇచ్చి పండుగ జరుపుకున్నారు. గోవులను ఖుర్బాని ఇవ్వడాన్ని

172