పుట:1857 ముస్లింలు.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హిందూ-ముస్లింల ఐక్యత


స్వచ్చందంగా నిషేధించారు.

ఈ విధంగా ఢిల్లీ నగరంలో గోవుల వధ జరగకుండా బహదూర్‌ షా జఫర్‌ స్వయంగా చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా అప్పటి నుండి ఢిల్లీ నగరాన్ని తిరిగి ఆంగ్లేయులు ఆక్రమించుకునేంత వరకు గోవధ జరగలేదు. గోమాంస విక్రేతల నుండి ఎటువంటి వత్తిడి వచ్చినా జఫర్‌ లొంగకుండా, ఎక్కడైనా గోవధ జరిగిందంటే ఆ ప్రాంతంలోని అధికారిని జవాబుదారునిగా చేసి ఉరిశిక్ష కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ చర్యల మూలంగా ముస్లింల పట్ల హిందూ ప్రజానీకంలో సద్భావన మరింతగా ఏర్పడి అది హిందూ-ముస్లింల ఉమ్మడి పోరాటాలకు ఇతోధిక బలానిచ్చింది.

ఈ చర్యల వలన ఆంగ్లేయులు ఆశించినట్టుగా హిందువులు- ముస్లింల మధ్యన విద్వేషాలు ప్రజ్వరిల్ల లేదు. ఈ విషయాన్ని, ఆంగ్ల అధికారి కీనిత్‌ యంగ్ (Keith Young) ప్రస్తావిస్తూ పండుగ సందర్బంగా నగరంలో ఏర్పడుతుందన్న పరిస్థీతిఏర్పడలేదు. 'ఈ సందర్భంలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను హిందువులకువ్యతిరేకంగా ముస్లింలను రచ్చగొట్టలేకపోయాం. ఆవులను కాదు మేకలను కూడ చంపరాదని రాజు గట్టిగా ఆజ్ఞాపించాడు. మా ఆశలు అడియాశలయ్యాయి.' అని వాపోయాడు. (Delhi 1857, Sir Henry W.Norman and Mrs. Keith Young, Low Price Publications, Delhi, First Pbublished in 1902, Reprint : 2001)

ఈ వ్యాఖ్యానం ఆంగ్లేయాధికారులు గోవుల ఖుర్బాని అంశాన్ని హిందూ- ముస్లింల మధ్య అనైక్యత సృష్టించడానికి ఎంతగా ఉపయోగించుకోవాలనుకున్నారో స్పష్టం చేస్తుంది. ఈ ఎత్తులను బహదూర్‌ షా జఫర్‌, ప్రజలు తమ స్నేహపూర్వక చర్యలతో తిప్పిగొట్టారు. జఫర్‌ అభీష్టానికి అనుగుణంగా హిందూ-ముస్లిం మధ్యన ఉన్న స్నేహ సంబంధాలను కాపాడుకునేందుకు ప్రజలు కూడా ఆయనతో సహకరించి ఆ సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు కృషి సల్పారు.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్న హిందూ-ముస్లింల మధ్య ఏర్పడిన ఐక్యతా బంధానికి ఏమాత్రం విఘాతం కలుగకుండా బహదాూషా జఫర్‌ పలు ఇతర జాగ్రత్త చర్యలు కూడ తీసుకున్నారు. తిరుగుబాటు జరిగిన ప్రతి ప్రాంతంలోనూ తన ఆజ్ఞలు ఖచ్చితంగా అమలు జరిగేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆజ్ఞలకు ఏమాత్రం

173