పుట:1857 ముస్లింలు.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత

స్వీకరించడం, ఆ క్రమంలో దేశంలో ఇతర ప్రాంతాలలో తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేసిన స్వదేశీ పాలకులంతా హిందూ-ముస్లిం అను తేడా లేకుండా బపదూర్‌ షా జఫర్‌ను తమ చక్రవర్తిగా అంగీకరించి ఆయన ప్రతినిధులులుగా మాత్రమే తమ ప్రాంతాలను పాలిస్తూ స్థానికంగా ఆంగ్లేయులతో తలపడటం జరిగింది.

గోవుల ఖుర్బాని మీద నిషేధం

ఆంగ్లేయులు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకున్నారు; హిందూ-ముస్లింల మధ్య చీలిక తేవడానికి అన్ని రకాల పన్నాగాలు పన్నారు. ఆ సందర్భంగా ముస్లింలు సాగించే ఖుర్బాని వారికి మంచి ఆయుధంగా దొరికింది. ఈ ఆంశాన్ని ఉపయాగించుకుని హిందూ ముస్లింల మధ్య నెలకొని ఉన్న ఐక్యతకు సులభంగా గండికొట్టవచ్చునని ఆంగేయులు భావించారు.

ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఆంగ్లేయ గూఢచారుల ద్వారా బక్రీద్‌ పండుగనాడు డిల్లీలో ఖుర్బాని విషయంలో హిందూ-ముస్లింల మధ్య తప్పకుండా కొట్లాట జరుగుతుందని కంపెనీ అధికారులకు సమాచారం అందింది. ఆ విషయం తెలియగానే ఆంగ్లేయాధికారులు సంబరపడపోయారు. ఆకొట్లాట తప్ప కుండా జరగాలని ఎదురు చూశారు. ఆ లక్ష్యం సాధనకు ఎత్తులు వేశారు. హిందూ-ముస్లింల మధ్య కొట్లాటకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేయాల్సిందిగా గూఢచారులను పురమాయించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐక్యంగా విక్రమిస్తున్న హిందూ-ముస్లింల మధ్యన మత విభేదాలను తెచ్చి వారిని విడదీసి తమ పబ్బంగడుపుకోవాలని పదకం రూపొందించారు.

ఆంగ్లేయులు ఎదురు చూస్తున్నట్టుగా ఖుర్బాని ఇచ్చే సంప్రదాయంగల బక్రీదు పండుగ వచ్చింది. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు హిందువులు గోమాతగా కొలిచే గోవులను తప్పకుండా ఖుర్భాని ఇస్తారు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి కలహాలు సృష్టించాలనుకున్నారు.

ఈ విషయాన్ని పసిగట్టిన పాదుషా బహుదూర్‌ షా జఫర్‌ తగిన చర్యలు తీసుకున్నారు. గోవధను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీచేశారు. ఆ సందర్భంగా ఆంగ్లేయుల తొత్తుగా వ్యవహరిసున్న చక్రవర్తి సన్నిహితుడు, చక్రవర్తి వ్యకిగత వైద్యుడెన అహసానుల్లా ఖాన్‌ దురుద్దేశ్యపూర్వకంగా గోవుల ఖుర్భాని మీద నిషేధం సరికాదాన్నాడు. ధార్మిక పండితులు ఇందుకు అంగీకరించరని చెప్పాడు. ఈ విషయం మీద మౌల్వీలను,

171