పుట:1857 ముస్లింలు.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఐక్యతను ధృవపరుస్తాయి.

ఐక్యతను పరిపుష్టం చేసిన పత్రికలు

ఈ పునాదుల మీద హిందూ- ముస్లింల ఐక్యత ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో మరింతగా పటిష్టంగా పరిఢవిల్లింది. ఆనాటి పత్రికలు కూడా హిందూ- ముస్లింల మధ్య ఐక్యతావశ్యకతను బాగా ప్రచారం చేశాయి. ప్రజలు హింఫూ -ముస్లిం తేడాలు లేకుండా కలసికట్టుగా విజృంభించినట్టయితే విజయం తధ్యమని ప్రకటిస్తూ ఢిల్లీ నుండి ప్రచురితమవుతున్న ఉర్దూ పత్రిక ఢిల్లీ అక్బార్‌ వ్యాసాలు ప్రచురించింది.

ఆ పత్రిక సంపాదాకులు మౌల్వీ ముహమ్మద్‌ ఖాఖర్‌ రాసిన వ్యాసాలు, ప్రచురించిన కథనాలు ప్రజలలో ధైర్యాన్నినూరిపోసేవి. ప్రజలలో సాహస ప్రవృత్తిని మేల్కొల్పేందుకు ఆయన పురాణాలనూ, చరిత్రనూ ఉటంకిస్తూ, ఆయా పురాణ పురుషులు, చారిత్రక వ్యక్తుల ధైర్యసాహసాలను ఉదహరిస్తూ వ్యాసాలు రాసిన వైనాన్ని నాల్గవ అధ్యాయంలో వివరించడం జరిగింది.

మౌలానా బాఖర్‌ కుమారుడు మౌలానా ముహ్మద్‌ హుసైన్‌ ఆజాద్‌ కూడా ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌లో రచనలు సాగించారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం గురించి తారిఖే ఇంక్విలాబ్‌ ఇబరత్‌ ఆఫ్‌జా శీర్షికతో ఆయన రాసిన కవిత ఆనాడు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మేరకు తండ్రి-కుమారులు కలసి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో కలం చేతబట్టి వలస పాలకుల మీద అక్షరాగ్నులు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ' రిసాల -యే-జిహాద్‌ ' (Risala-i-Jihad) శీర్షికతో రాసిన కరపత్రంలో బ్రిటిషు వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టాలన్న మహత్తర లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని హిందువులు-ముస్లింలు ఐక్యంగా శత్రువు మీద యుద్ధం సాగించాలని పిలుపునిచ్చారు.

ప్రథమ స్వాతంత్రసంగ్రామానికి ఆయువుపట్టుగా నిలచిన ఢిల్లీని తమ పట్టునుండి జారిపోనివfiవ్వరాదని తిరుగుబాటు యోధులు, ఏ విధంగానైనా ఢిల్లీని పునరాక్రమించుకోవాలని ఆంగ్లేయాధికారులు ఎత్తులు, ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోరాటాలు సాగిస్తున్నారు. ఈ పోరాటంలో మతాలకు అతీతంగా హిందూ-ముస్లింలు భుజం భుజం కలిపి ఉమ్మడి లక్ష్యం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడుతున్న వైనం ఆంగ్ల అధికారులకు అర్ధమైంది.

1857 మే 11న మీర్‌ నుండి హిందూ-ముస్లిం సైనికులు కలసికట్టుగా బయలు దేరడం, ఢిల్లీ చేరుకుని మొగల్‌ పాదుషా బహదాూర్‌ షా జఫర్‌ను చక్రవర్తిగా

170