పుట:1857 ముస్లింలు.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

పోరాటయోధులు తమ ఆయుధాలను నేరు గా బ్రిటిషర్ల మీద ప్రయాగించారు. ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న స్వదేశీ సంస్థానాధీశుల మీద కూడ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అభినందన కల్గించిన ఆగ్రహం

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో ఆంగ్లేయుల పక్షంగా వ్యవహరించి తిరుగు బాటు జ్వాలల నుండి ఈస్ట్‌ఇండియా కంపెనీ అధికారులను రక్షించి బ్రిటిషర్ల పాలనకు ప్రాణం పోసిన స్వదేశీ పాలకులను ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవార్డులు-రివార్డులతో ముంచెంత్తింది. ఆ క్రమంలో నిజాం నవాబుకు బ్రిటిషర్లు అందచేసిన బిరుదులు, బహుమానాలు కూడ స్వేచ్చను కోరుకుంటున్నప్రజలలో ఆగ్రహానికి కారణమయ్యాయి.

1859లో బ్రిటిషు రెసిడెంటు కలకత్తాకు వెళ్ళి నిజాం కోసం ప్రశంసల పత్రం (ఖతీరా) తెచ్చాడు. ఈ వార్త తెలిసిన ప్రజలు మండిపడ్డారు. బ్రిటిషు రెసిడెంటు తెచ్చిన పత్రం అభినందన పత్రం కాదని అది అవమానకర పత్రమని ప్రజలు ప్రధానంగా పోరాట యోధులైన స్వదేశీ సిపాయీలు భావించారు. ఆ యోధులు ఆంగ్లేయుల పట్ల నిజాం చూపుతున్న విధేయతను, వారి అభినందనలను ఆనందంగానూ, మరెంతో గౌరవంగా భావించి స్వీకరించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

1859 మార్చి 15న నిజాం దర్బారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిజాం సంస్ధానాధీశుని కోసం తెచ్చిన ప్రశంసాపత్రాన్ని బ్రిటిష్‌ రెసిడెంటు సంస్థానాధీశునికి అందించాడు. ఆ అభినందన పత్రం విషయం తెలుసుకున్న రోహిల్లా యోధుడు జంహంగీర్‌ ఖాన్‌ కోపంతో రగిలిపోయారు. ఏదైనా చేస్తా లేకుంటే చస్తా అని నిర్ణయించుకున్నారు. మనసులో రూపొందిన పదకాన్ని అమలుపర్చేందుకు నిజాం దేవిడి ముందు కాపుకాశారు.

ఆ సమయంలో దార్బారులో ప్రశంసాపత్ర ప్రదానోత్సవ కార్యక్రమం ముగిసింది. ఆ ఆనందంలో నిజాం నవాబుతో పాటుగా దార్బారు నుండి దర్పంగా బయటకు వస్తున్న ఆంగ్లేయాధికారి డేవిడ్‌సన్‌ ను గమనించిన జహంగీర్‌ ఖాన్‌ కార్బన్‌తో అతని మిద అకస్మాత్తుగా దాడి చేశారు. ఆలోగా అప్రమత్తుడైన డేవిడ్‌సన్‌ ఆ తాకిడి నుండి తృటిలో తప్పుకున్నాడు. దాడిలో గురి తప్పినా పట్టువదలని జంహంగీర్‌ ఖాన్‌ అతడ్ని ఎలాగైనా

162