పుట:1857 ముస్లింలు.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు.pdf

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

సంహరించాలన్న లక్ష్యంతో మరుక్షణం కత్తిదూశారు . ఆలోగా నిజాం అనుచరులు, సైనికులు అప్రమత్తులై జహంగీర్‌ ఖాన్‌ మీద తుపాకి గుళ్ళ వర్షం కురిపించటంతో ఆ యోధుడు అక్కడిక్కడే కుప్ప కూలిపోయారు.

ఈ అనూహ్య సంఘటనతో బిత్తరపోయి భయంతో వణికిపోతూ డేవిడ్‌సన్‌ పక్క నే ఉన్న గదిలోకి పరుగులు తీసి దాక్కున్నాడు. ప్రమాదం పూర్తిగా తప్పిందని రూఢిగా తెలుసుకున్నాక గాని అతను బయటకు రానికి సాహసిం చలేదు. ఈ సాహస చర్యకు పాల్పడినజహంగీర్‌ ఖాన్‌ ఒకనాటినిజాం దర్బారులో ప్రముఖుడిగా ఖ్యాతిగాంచి, ఆంగేయుల పెతనాన్ని వ్యతిరేకించి నిజాం ఆగ్రహానికి గురైన ఉమ్రా మనవడుకావటం విశేషం.

ఆ కాల్పులలో తీవ్రంగా గాయ పడిన జహాంగీర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ సంఘ టన నిజాం ప్రబుత్వాన్ని కుదిపేయడంతో, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని భావించారు. ఆ కుట్ర వెనుక నున్న వ్యక్తులు-శక్తు లను బహిర్గతం

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 1957లో హైదారాబాదులోని కొఠి సెంటరులో నిర్మాణమైన స్మారక స్థూపం.

163