పుట:1857 ముస్లింలు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

ఈ విధాంగా గుంటూరు, కృష్ణా గోదావరి మండలాలలో ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ప్రభావం తీవ్రంగా కన్పించింది. (1857, యం.వి.ఆర్‌ శాస్త్రి, ఆంధ్రభూమి దినపత్రిక, 2007 జనవరి 14)

ఉత్తర భారతానికి వెళ్ళిన యువకులు

స్వస్థానంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొనడమే కాకుండా, ఉత్తర భారతంలో స్వదేశీ యోధులు సాధిస్తున్నవిజయాల గురించి విన్న రాయలసీమ యువకులు ప్రజ్వరిల్లుతున్న ఉత్తర భారతానికి కూడ వెళ్ళారు. పరాయి పాలకుల పెత్తనాన్ని సహించని పలువురు ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులతో కలసి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొనేందుకు రాయలసీమ ప్రాంతం నుండి ఉత్తర భారతానికి వలస వెళ్లారని అప్పటి కడప మెజిస్ట్రీట్ 1857 జూన్‌ 20న మద్రాస్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volume I (1800-1905 AD), Govt. of AP, Hyderabad, 1997, P. 147)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత

1857 సెప్టంబరు మాసం చివరికల్లా ఢిల్లీ కేంద్రంగా ఆరంభమైన ప్రథమ స్వాతంత్య్ర సమరం విఫలమైనప్పటికీ, ఉత్తర భారతదేశంలో బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాది, షెహజాదా ఫిరోజ్‌ షా, నానా సాహెబ్‌, ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కంవర్‌ సింగ్ లాంటి నేతల నాయకత్వంలో లక్నో, కాన్పూరు, ఝాన్సీ తదితర ప్రాంతాలలో ఎగురుతున్న తిరుగుబాటు బావుటాలను ప్రేరణగా తీసుకుని దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుబాటు ఛాయలు కొనసాగుతూనే వచ్చాయి.

ఆ ఛాయలు నిజాం గడ్డ మీద కూడా ప్రబలంగా కన్పించాయి. తిరుగుబాటు విఫలమైనా, స్వదేశీ యోధుల మీద ఆంగ్లేయులది పైచేయిగా కన్పించినా స్వేచ్ఛా- స్వాతంత్య్రకాంక్షాపరులైన ప్రజలు మాత్రం చాలా కాలం పోరుబాట వీడలేదు. స్వదేశీ ప్రభువులు కలసి రాకపోయినా ఆంగ్లేయులను ప్రధాన శత్రువుగా పరిగణించిన

161