పుట:1857 ముస్లింలు.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

మౌల్వీఇబ్రాహీం, మౌల్వీ అక్బర్‌, మౌల్వీ అల్లాఉద్దీన్‌ తిరుగుబాటును ప్రోత్సహించటమే కాకుండ యోధులకు ముందు నిలచి వారిని నడిపించారు. నైజాం సంస్థానం రాజధాని హెదారాబాదు గడ్డ మీద తొలిసారిగా మౌల్వీ ఇబ్రహీం తిరుగుబాటు బావూటాను ఎగురవేశారు. మౌల్వీ ఇబ్రహీం ఉద్బోధ వలన 1857 జూన్‌ 10న ప్రజలు తిరుగుబాటు చేస్తారని నిజాం, బ్రిటిష్‌ రెసిడెంటు అనుమానించారు. ఈ తిరుగుబాటుకు మౌల్వీ ఇబ్రాహీం నాయకత్వం వహిస్తారన్న మిష మీద ఆయనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా బ్రిటిష్‌ రెసిడెంటు కోరగా మౌల్వీని నిజాం పిలిపించి, హెచ్చరించి పంపి వేశాడు. ఆ కారణంగా మౌల్వీ అరెస్టు నుండి తప్పించు కోగలిగారు.

ఆ తరువాత జూన్ 13న చార్మినార్‌ సమీపాన గల చారిత్రక మక్కా మసీదులో మద్రాసు నుండి వచ్చిన ఇరువురు వ్యకులు నమాజ్‌ తరువాత మధ్యలో లేచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను స్వాతంత్య్రపోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రసంగించారు. ఈ విషయం తెలిసిన ఆంగ్లేయులు వారిరువుర్ని బంధించేలోగా ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి వారిద్దర్ని అక్కడి నుండి తప్పించారు. ఆ విధంగా అదృశ్యమైన ఆ యోధులను ఖామోషా అను ఫకీరు రక్షణ కల్పించారని బ్రిటిష్‌ గూఢచారులకు ఆచూకి అందినా ప్రజల సహాయనిరాకరణ మూలంగా వేరెవ్వరినీ అరెస్టు చేయలేకపోయారు.

మౌల్వీ అక్బర్‌ నగరంలో ప్రసిద్ధి చెందిన మక్కా మసీదులో ప్రజల సమావేశం ఏర్పాటు చేసి బ్రిటిషు ప్రభుత్వం పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా మక్కా మసీదు మీద స్వతంత్ర పతాకం ఎగురవేసేందుకు ఆయన, ఆయన సహచరులు కూడ సిద్ధపడ్డారు. నిజాం ఏర్పాటు చేసిన కాపలాదారులు జాగరూకులై ఆ ప్రయత్నాలను వమ్ము చేశారు.

పరాయి పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా మౌల్వీల చర్య లు, ఉద్బోధలు ఎంత వరకు వెళ్ళాయంటే మసీదుల్లో శుక్రవారం ఖుద్బా సందర్బంగా మౌల్వీలు ప్రజలను రెచ్చగొడుతున్నారన్న నెపం మీద శుక్రవారం ప్రార్థనలో ఖుత్బాను కూడ నిజాం నిషేదించాల్సి వచ్చింది. ఈ మేరకు మౌల్వీలకు, ధార్మిక పండితులకు, ధర్మ ప్రచారకు లకు, ఫకీర్లకు నిజాం పాలకులు ప్రత్యే కంగా హెచ్చరికలు కూడ జారీచేశారు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా, నిజాం శిక్షలకు ఏమాత్రం భయపడకుండా ఆ స్వేచ్ఛాభిలాషులైన

146