పుట:1857 ముస్లింలు.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్ర ప్రదేశ్‌ ముసింలు

పుట్టుకొచ్చాయి. ఆ నినాదాలు కాస్తా నగరంలో ప్రకటనల రూపంలో కన్పించాయి. ("...Faithful to murder the feringhee" - History of the Deccan Vol-II, JDE Gribble, Mitttal Publications, NewDelhi,1990, P. 257).

ఆంగ్లేయాధికారులను భయపెట్టేందుకు ప్రజలు, నిజాం సంస్థానంలోని ప్రముఖులు కూడా ఉద్దేశ్యపూరకంగా పలు విధాలుగా ప్రచారాలు కూడ సాగించారు. ఈ విషయాన్ని ఆంగ్లేయాధికారి బ్రిగ్స్ వివరిస్తూ నైజాం సంస్థానంలోని మంత్రులు, ఉన్నతాధికారులు తేనెపూసిన కత్తుల్లా వ్యవహరించే వారు. పైకి స్నేహపూరితంగా ఉంటూనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని సలహా ఇచ్చేవారు. ఇక్కడి పరిస్థితులు బాగాలేవు. మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు అని చెబుతూనే పారిపోయేలా చేసేవారు. పారిపోతే అధికారి పరువు పోతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వపు నైతిక బలం దెబ్బతింటుందని వారి ఉదేశ్య అని రాశాడు. (1857 తెలుగునాట తిరుగుబాటు, డాక్టర్‌ కె మహంకాళిరావు, నవయుగ భారతి, భాగ్యనగర్‌, 2001 పేజి. 17-18).

ఆ సమయంలో షంషుల్‌ ఉమ్రా చిన్న కుమారుడు ఇఫ్తెకారుల్‌ ముల్క్‌ హైదారాబాదులో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీశాడని అప్పటి కల్నల్‌ డేవిడ్‌సన్‌ ఉన్నతాధికారులకు రిపోర్టు చేశాడు. నిజాం, బ్రిటిషు వారికి విరుద్ధంగా మాట్లాడిన వారినందరిని బెదిరించి వదిలేయటం కాకుండా వారందరిని నిర్బంధించాలని కూడ ఆ ఆంగ్లేయాధికారి ఆజ్ఞాపించాడు. (హైదారాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పేజి.31).

పోరుబాటలో మౌల్వీల మహత్తర పాత్ర

ప్రధానంగా సైనికులలో, ప్రజలలో ఆంగ్లేయుల పట్ల విద్వేషం మరింతగా పెంపొందిచటంలో ధార్మిక పండితులైన మౌల్వీలు ప్రధాన పాత్ర వహించారు. ఆనాటి చారిత్రక తిరుగుబాటుకు మౌల్వీలు వెన్నె ముకగా నిలిచారు. ప్రజలను ప్రేరపించి పోరుబాట నడిచేందుకు వారిని సన్నద్దులను చేయటంలో మౌల్వీలు బహుముఖ పాత్ర ఉంది.మౌల్వీలు ప్రజలను ప్రేరేపించటం, ప్రోత్సహించటంతో సరిపెట్టుకోలేదు కదనరంగంలో కూడా ముందు నిలిచారు. కత్తిపట్టి ముందుకు నడిచి ఇతరు లకు మారదర్శ కులయ్యారు. బలమెన స్వేచ్చ-స్వాతంత్య్ర కాంక్షకు , కరడు కట్టిన బ్రితిష్‌ వ్యతిరేకతకు మౌల్వీలు ప్రతీకలయ్యారు.


145