పుట:1857 ముస్లింలు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు

మౌల్వీలు, యోధులు మున్ముందుకు సాగారు.

ఆ కారణంగా బ్రిటిషు అధికారులు మౌల్వీలు, ఫకీర్ల మీద నిఘా పెట్టారు. బోయినపల్లిలో ఓ ఫకీరుబ్రిటిషు వారికి వ్యతిరేకంగా ప్రబోధం చేస్తుంటే అతనిని బంధించి జైల్లో వేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను, నవాబును రచ్చగొడుతూ నగరంలోని గోడల మీద అంటించిన కరపత్రాలు చూసి ఆరాధనా మందిరాలలో ఎవ్వరూ కూడా ఆ విషయాలను ప్రస్తావించి ప్రజలు ఉసిగొల్పకుండా ఉండేందుకు మౌల్వీలు, ఫకీర్ల పట్ల నిజాం చాలా కరినంగా ప్రవర్తించాడు. బ్రిటిష్‌ వ్యతిరేకి అని చిన్నపాటి అనుమానం కలిగినా ప్రతి ఫకీరును, ప్రతి మౌల్వీని నిర్బంధించారు. ఆంగ్లేయుల సలహా మేరకు

ప్రఖ్యాత చార్మినార్‌ కట్టడం

నిజాం నవాబు ఎంత కఠినంగా ప్రవర్తించినా ప్రజలలో వ్యతిరేక ప్రచారం నిరంతరం సాగింది. చివరకు ఈ ప్రచారం, ప్రయత్నాలు ప్రజానీకాన్ని పోరుబాట పట్టించగా, స్వదేశీ సైనికులలో తిరుగుబాటు జ్వాలను రగిలించింది.

సైనికులలో తిరుగుబాటు జ్వాలలు

ఒక వైపున ప్రజలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు గురించి ఆలోచనలు సాగుతుండగా నిజాం సంస్థానానికి చెందిన సెనికులలో కూడ మరోవైపు న


147