పుట:1857 ముస్లింలు.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

మీద పలు నేరారోపణలు మోపి విచారణ తంతు జరిపి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. 1859 జూన్‌లో ఆయనను అండమాన్‌ తరలించారు. మౌల్వీ అల్లావుద్దీన్‌ అండమాన్‌ జైలులో దుర్భర జీవితం గడుపుతూ 1884లో కన్నుమూశారు.

1957లో హైదారాబాదులోని కోఠి సెంటరులో 1857 నాటి యోధుల గౌరవారం రాష్ట్ర ప్రబుత్వం ఒ స్మారక స్థూపాన్ని నిర్మించింది. ఆనాటి దాడికి నాయకత్వం వహించిన రొహిల్లా యోధుడు తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికాయాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం బహిరంగంగా వేలాడ దీసిన ప్రస్తుత సుల్తాన్‌ బజార్‌ వీధిని తుర్రేబాజ్‌ ఖాన్‌ వీధిగా నామకరణం చేసింది.

మౌల్వీలంటే ఉలికిపాటు

ఉలమా అంటే ఆలిం అను పదానికి బహువచనం. ఆలిం అంటే ఖురాన్‌, హదీస్‌ (ప్రవక్త ప్రచనాలు-ఆచరణ) పరిజ్ఞానంలో నిష్ణాతుడని అర్థం. ఆ కారణంగా మౌల్వీలు ఇస్లామియా పండితులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ విధంగా ఖురాన్‌-హదీస్‌ల జ్ఞానాన్ని పదిమందికీ పంచుతూ ప్రశాంత జీవనం గడిపే ధార్మికవేత్తలు అందుకు భిన్నంగా ఆయుధం చేతబట్టి శత్రువులో భయోత్పాతం కలిగించారు.

ఇస్లామియా పండితులైన మౌల్వీల నుండి ఆంగ్ల సైన్యాలు భయానక యుద్ధ అనుభవాలను చవిచూడటం వలన ఆంగ్లేయాధికారులు మౌల్వీ, మౌలానా అని పిలువబడుతున్న వారందారినీ తిరుగుబాటుదారులుగా పరిగణంచారు. మౌల్వీ, మౌలానా, ఉలేమా అను పదం వింటేనే ఆంగ్లేయులు ఉలిక్కిపడ్డారు . మౌల్వీ అను పదాన్ని ఇస్లామియా పండితుడు అని కాకుడండ భయానక శత్రువు అను భావం ఆంగ్లేయులలో కలగడంతో మౌల్వీ అను పదాన్ని వినడానికి కూడ బ్రిటిష్‌ అధికారులు ఇష్టపడలేదు.

ఆ కసతో మౌల్వీలను ఆంగ్లేయులు, ఆంగ్లేయ న్యాయస్థానాలు అధిక సంఖ్యలో బలి తీసుకున్నాయి. 1857 నాటి సంగ్రామం సందర్భంగా ఆంగ్ల సైనికుల చేతుల్లో సుమారు రెండు లక్షల మంది మృత్యువాత పడగా, 51,200 మందికి పైగా ఇస్లామియా పండితులు ఉన్నారని ఆంగ్లేయాధికారి ఎడ్వర్డ్‌ థామస్‌ స్వయంగా అంగీకరించాడు.

మౌల్వీ, మౌలానాలను బద్ధ శత్రువులుగా భావించిన ఆంగ్లేయులు ఒక్క ఢల్లీలోనే 500 మంది మౌల్వీల మీద తిరుగుబాటుదారుల ముద్రవేసి వివిధ పద్ధతులతో అంతం

107