పుట:1857 ముస్లింలు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

చేశారు. భారీ సంఖ్యలో నిర్బంధంలోకి తీసుకున్న మౌల్వీలను కారాగారాల్లో దీర్గ…కాలం బంధించి పెట్టారు. రాణి విక్టోరియా ప్రకటన తరువాత స్వదేశీయుల మద్దతు సంపాదించేందుకు కొందరు స్వదేశీ పాలకులను, తిరుగుబాటు యోధులను నిర్భంధాల నుండి విముక్తి కల్గించినప్పటికీ చాలా మంది మౌల్వీల విషయంలో ఆ మినహాయింపు ఇవ్వలేదు. ఆ కారణంగా చాలా కాలం మొల్వీలు కారాగారవాసంలో దుర్భ జీవితాలు గడపాల్సి వచ్చింది.

1857లోనూ, ఆ తరువాతా మౌల్వీల మీద అంతులేని విద్వేషాన్నిపెంచుకున్న ఆంగ్లేయాధికారులు తమ ప్రతీకారచర్యలకు ఇస్లామియా పండితులను పెద్ద సంఖ్యలో బలిచేశారు. మౌల్వీలను వందల సంఖ్యలో ఫిరంగులకు కట్టి పేల్చివేశారు. తుపాకి గుండ్లకు గురిచేశారు; ఉరితీశారు. ఆ విధంగా కసితోపాటుగా భయం కూడ తీరక మౌల్వీలకు జీవితకాల ప్రవాసశిక్షలను విధించి వారి స్వస్థానాలకు, కుటుంబాలకు కడుదూరంగా అండమాన్‌ దీవులకు పంపివేశారు.

అండమాన్‌కు తరలిన తొలి యోధులు

ఆంగ్లేయ సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలలో భాగంగా అత్యధిక మౌల్వీలు అండమాన్‌ దీవులకు పంపబడ్డారు. ఆ విధంగా అండమాన్‌కు తరలించబడిన యోధులు జీవితకాలమంతా ఆ దీవులలో గడపాలని ఆంగ్ల న్యాయమూర్తులు కఠినంగా తీర్పులు చెప్పారు. ఆ తీర్పులకు అనుగుణంగానే మౌల్వీ అల్లాఉద్దీన్‌లాంటియోధులు 25 సంవత్సరాలకు పైగా అండమాన్‌ జైలులో దుర్భరమైన జీవితాన్ని గడిపి కన్నుమూశారు.

1857 నాటి యోధులలో అండమాన్‌కు తరలించబడిన మౌల్వీలలో అబ్దుల్లా ముహియుద్దీన్‌,మౌల్వీ అల్లాఉద్దీన్‌, ఆనీర్‌ ఖాన్‌, అంవర్‌ ఖాన్‌ ప్యారే ఖాన్‌, భాయి ఖాన్‌, బుద్నయ్యా పీర్‌ సాహెబ్‌, ఫక్రు, ఫరాస్‌ ఖాన్‌ ఇమాం ఖాన్‌, మౌల్వీ ఫజల్‌ హఖ్‌ ఖైరతాబాది, గౌస్‌ గులాం, గులాబ్‌ ఖాన్‌, హిదాయతుల్లా, హుసేన్‌ గుల్జార్‌, హుసేన్‌ హటేలా, హుసేన్‌ ఇబ్రహాం, హుసేన్‌ షా ఫకీర్‌, కరీం ఖాన్‌, ఖిఫాయతుల్లా, మౌల్వీ లియాఖత్‌ అలీ, మహిబుల్లా, మమ్మూఖాన్‌, ముహ్మద్‌ ఇస్మాయిల్‌ హుస్సేన్‌ మునీర్‌, ముహ్మద్‌ యార్‌ ఖాన్‌, నాసిరా, నియాజ్‌ ముహ్మద్‌ ఖాన్‌, నుజ్జర్‌ ముహమ్మద్‌, ఖయూం

108