పుట:1857 ముస్లింలు.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

విడిచారు. (Freedom Fighters of Indian Mutiny 1857, M.P. Srivastawa, Allababad,1997, P.163-164)

దక్షిణాది యోధుడు మౌల్వీ అల్లావుద్దీన్‌

ప్రథమ భారత స్వాతంత్య్రసంగ్రామంలో ఉత్తరాదికి చెందిన మౌల్వీలు ఏ మేరకుబ్రిటిష్‌ వ్యతిరేక పోరాలలో పాల్గొన్నారో అందుకు ఏమాత్రం తీసిపోని విధగా, తమ పరిమితుల మేరకు, దక్షిణాదిలో కూడ మౌల్వీలు తమదైన సాహసోపేత పాత్రను నిర్వహించారు. ఈ పోరాటంలో ప్రదానంగా పేర్కొనదగిన ఇస్లామియా ధార్మిక పండితు లు మౌల్వీ అల్లావుద్దీన్‌. నిజాం రాజ్య రాజధానీ నగరం హైదారాబాదుకు చెందిన మౌల్వీ వంటి యోదులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ వ్యతిరేకతకు పరాకాష్టగా 1857 లై 17 సాయం సమయాన నగరంలోని బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి జరిగింది. ఈ చారిత్రాత్మక దాడికి ప్రముఖ రోహిల్లా యోధుడు తుర్రేబాజ్‌ ఖాన్‌తో కలసి ఆయన నాయకత్వంవహించారు. ఈ ఇరువురి నేతల నేతృత్వంలో సుమారు 500 మంది రోహిల్లా వీరులు, పెద్ద సంఖ్యలో ప్రజలు రెసిడెన్సీ మీద దాడికి సిద్ధమయ్యారు. (The Freedom Struggle in Hyderabad, Volume II ; P.51)

బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడికి ప్రఖ్యాతి చెందిన మక్కామసీదు నుండి బయలు దేరిన యోధుల దాళానికి మౌల్వీ ఇబ్రహీం తిరుగుబాటు పతాకంతో ముందు నడిచారు. అటు నిజాం ఇటు ఆంగ్ల సైన్యాల ధాటికి తట్టుకోలేక పోయిన స్వదేశీ యోధుల సాహసోపేత పోరు సఫలం కాలేదు. ఈ పోరాటంలో మొత్తం మీద 32 మంది తిరుగుబాటు యోధులు ప్రాణాలు కొల్పోగా పలువురు గాయపడ్డారు. చివరకు జూలై 18 ఉదయానికల్లా తిరుగుబాటు యోధులు అ ప్రాంతం నుండి పూర్తిగా తప్పించుకుని వెళ్ళిపోయారు. (Ibid.,P. 52)

ఆంగ్లేయుల చేత చిక్కకుండా మౌల్వీ అల్లావుద్దీన్‌ చాకచక్యంగా తప్పించు కున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళి అక్కడ ఒకటిన్నర సంవత్సరం రహస్య జీవితం గడిపారు. ఆయనను బంధించి ఇచ్చిన వారికి నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరు వాత కొంతకాలానికి ఓ ద్రోహి అందించిన సమాచారం ఆధారంగా మంగలపల్లి వద్ద నిజాం-బ్రిటిషు సైన్యాలు ఆయనను నిర్బంధించ గలిగాయి. ఆయన

106