పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

కాళిదాస చరిత్ర

దేహములు రెండుగాని శరీరమొక్కటేయని లోకులు భావించునట్లు పరస్పరప్రేమగలిగి మెలుగుచుందెను. కాళిదాసుమాట ప్రతి విషయమున నతడు శిరసావ హించుచుండెను. అతని యాలోచనములేక యత డేకార్యమును చేయడ;య్యెను.

త్వ మే వా హ మ్

భోజుని యాస్ధానమందలి

కవులలో దండి, భవభూతి

శంకరులను మువ్వురు నిరంతరము కాళిదాసునితో స్పర్దగలిగి యున్నట్లు లోకమునందనేకకధలు గలవు. ఏకసందగ్రాహి, ద్విసంతగ్రాహి, తనంతగ్రాహులు కూడ వారు మువ్వురేనని ప్రతీతికలదు. కాళిదాసునకును వీరి ముగ్గురికిని దఱుచుగా శాస్త్రచర్చలు జరుగుచు వచ్చెను. అందొకసాది కాలిదాసు గెల్చుటయు, మఱియొకసారి యాపండితులు గెల్చుటయు సంభవించుచుండెను. కాళిదాసుడే యందఱికంటే గొప్పవాడని కొందఱును, దండిభవభూతిశంకరులే గొప్పవారని మఱిమొందరు బలుకజొచ్చిరి. ఒకనాడు భోజమహారాజు విద్వజ్ఞలనంబులు, మహాకవులు, మంత్రిసమంతులు, బందుమిత్రులు, పరివారజనము పరివేష్టించి నిండుకొలువుండ నచ్చటనెవిషయమైన వివాదము ప్రబలెను. ఈవిషయమై మనుష్య మాత్రు లెవ్వరు నిదమిద్దమని చెప్పంజాలరనియు విద్యాధి దేవతయైన శ్రీసరస్వతీదేవియే నిర్ణయించుట కర్హురాలనియు సభాసదులైన పండితులు పలికిరి. అప్పుడు కాళిదాసు తన ప్రభావముచేత సరస్వతీదేవి నావాహనముచేసి "తల్లీ! మాతారతమ్యములు చెప్పి యీ వివాదము నీవే పరిస్కరింపదగుదు" వని ప్రార్దించెను. అప్పుడు సభలోనొక శంబ్దము వినబడెను సరస్వతీదేవి