ఈ పుటను అచ్చుదిద్దలేదు
84
కాళిదాస చరిత్ర
సభాసదులకు గనంబడకుండ మాటలాడజొచ్చెను. ఆమె యీ తెఱంగున బలికెను.
"కవిర్ధండీ కవిర్దండీ భవభూతిస్తు పండిత"
తా॥దండియే కవి!దండియే కవి భవభూతియున్ననో పండితుండు
అని శ్లోకములో సగముచెప్పి శారదాదేవి నిమేష మాత్ర మూరముండెను. దండి కవియనియు భవభూతి పండితుడనియు జెప్పి కాళిదాసుమాట యంతమాత్ర మెత్తక యామె యూరకుండుటచే గాళిదాసుడు కవియు గాడని పండితుడుగాడని శత్రుపక్షమువారు పరిహాస సూచకమైన నవ్వులు నవ్విరి. అప్పుడు కాళిదాసుడు రోషారుణిత లోచనుడై సరస్వతీదేవి నుద్దేశించి "కోహాం రండే" నేనెవరేముండా యని యఱుముఱిమినట్లు పలికెను. అప్పుడా యశరీరవాణి "త్వమే వాహం త్వమేవాహం న సంశయ।" అని ప్రత్యుత్తరమిచ్చెను. అనగా "నీవే నేను నేనే నీవు. సంశయములే" దని ప్రత్యుత్తర మిచ్చెను. ఇదియంతయు నీ క్రిందిశ్లోకముమైనది.
శ్లో॥ కవి ర్ధండి కవిర్దండి భవభూతిస్తు పండిత।;
కోహంరండే! త్వమేవాహం త్వమేవాహం న
సంశయ:
బ్రహ్మదేవుని పట్టపురాణియు, సకల విద్యాధి దేవతయు నైన వాణి యశరీరవాణియై "నీవేనీ" వని యెల్లవారు వినుచుండి మచ్చై స్వరముతో బలుకుటచే సభాస్దానులును, భోజమహీపాలుడును, మహాశ్చర్యమునొంది కాళిదాసుయొక్క ప్రభావమును, నిరవధిక పాండిత్యమును మిక్కిలి ప్రశంసించిరి. దండిభవభూతులచండగర్వమణగెను. సరస్వతి శంకరునిమాటయైన నెత్తికొనలేదు.