కాళిదాస చరిత్ర
శ్లోకము రచియించి మీధర్శనము చేయింపుమంటిని" అని 'అర్దివత్ బకవత్ ' అను శ్లోకము చదివి సభవారందఱిని నవ్వించి కాళిదాసు మఱియు నిట్లనియె-- "ఆశ్లోకము చదివి వీడు పరమమూర్ఖుడు వీనివంటివానిని దీసికొనిబోయినచో రాజు తనకడ నింతకంటే మంచి కవీశ్వరులను దీసికొనిబొమ్మనవలదు. బాగున్నదని వారిలొ వారాలోచించుకొని నాకు మీదర్శనము చేయించిరి. నేను మీ దర్శనముచేసినతోడనే వీరు ధారణచేయుటకు వీలులేని కఠినాక్షరములతొ మొదటిశ్లోకమును జెప్పితిరి. ఇందులొ నేకసంతాగ్రాహికి నత్తి, అందుచేత నతడు కఠినాక్షరపూరిత మైన యా శ్లొకములను జ్ఞాపకముంచుకొని చదువలేకపోయెను. వానికి రాకపోవుటచే దక్కిన యిద్దఱికి వచ్చినవి కావు. కాబట్టి యాశ్లోకములను విడిచి ధారణచేయుటకు సులభములైన 'మహారాజ, శ్రీమన్ ' అను శ్లోకము మొదలుకొని నాలుగుశ్లోకములను ధారణచేసి పూర్వకవి విరచనలని నాకవమానము సంఘటింప తలుచు బ్చున్నారు. 'వినాశకాలే విపరీతబుద్ది ' అనునట్లు వీరికి జెడుకాలము వచ్చిటచే నిట్టిబుద్దులుపుట్టినవి. ఈరహస్య మెఱుగక దేవరవారు పయోముఖ విష కుంభములు, గోముఖవ్యాఘ్రంబులు ననదగు వీరిని సత్కవులని, సత్పురుషులని గౌరవించి "మాన్యంబులిచ్చి పోషించుచున్నారు." అని గంభీరస్వరముతొ రాజున కభిముఖుడై విన్నవింప సభాసదులు వారి దౌర్జన్యమును విని ఛీ ఛీ యనిరి. మహారాజు కవిత్రయమును గట్టిగా మందలించి నాడు మొదలుకొని యట్టి దుష్కార్యము నెన్నడైన మరల చేసిన పక్షమున రాకాస్దానమునుండి వెడలు గొట్టుదురని చెప్పి యా తప్పు సైరించెను. కవులును తమ గుట్టు బట్టబయలగుటచే సిగ్గుపడి మాఱుమాటాడక తలవంచుకొని యూరకుండిరి.
నాటినుండియు భోజరాజు కాళిదాసును దన యాశ్రితునిగా గాక పరమగురువుగా, నాప్తమిత్రునిగా, భావించుచు, వీరికిరువురకు