పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


మూస:Righ73

కాళిదాస చరిత్ర

మువ్వురు క్రొత్తగావచ్చిన కవినిజూచి "ఏదీ? మీరు చెప్పిన శ్లోకము దదువండి-విందము" అని యడుగుచుందురు. వారేమోతనకు మహోపకారము సేయగలరని గంపెడాసెపెట్టుకొని యాకైవీశ్వరుడు తాను రచియించిన శ్లొకములందెల్ల మిక్కిలి హృదయంగమమై రసవంతమైన శ్లోకమొకటి చదివి వినిపించుచుండును. ఓకసారి వినగానే యెకసంతగ్రాహి కెట్టిశ్లోకమైన వచ్చును గనుక "అయ్యో! ఇది పూర్వమున్నశ్లొకమే కదండి! మీరుచేసినామని చెప్పుచున్నారేమిటి?' యని యత డా శ్లోకమును మరల జదువును. శ్లోకకర్తయు నెకసంతాగ్రాహియు జదివినతోడనే ద్విసంతాగ్రాహి "ఓనండి! ఇది పూర్వశ్లోకమే" యని తానుగూడ చదువును. మూడుసార్లు వినుటచేత వెంటనే త్రిసంతగ్రాహి "ఇది మానాన్నగారు చేదువుచుండగా నా చిన్నప్పుడు నేను విని వల్లించితి" నని తాను చదువును. అప్పుడాకవీశ్వరుడు నిర్విణ్ణుడై సిగ్గుపడి రాజదర్శనము చేయకుండగనే స్వగృహమునకు మరలిపోవు చుండును. ఇట్లు కొంతకాలము జరుగుటచే రాజాస్దానమునకు నూతన కవులు వచ్చుట మానిరి. భోజరాజు కవిత్రయమును జూచి "ఏమి! మునుపటివలె మన యస్దానమునకు సత్కవీశ్వరులు వచ్చుటలేదని పలుమాఱడుగ జొచ్చెను." ఆ కవిత్రయము తాలోదాము ముసిముసి నవ్వులు నవ్వుకొని "దేవా! దిగ్గజంబులవంటి పండితులు, మహాకవీశ్వరులు మీముందర నిలువ జాలరు. కవిత్వముజెప్పి మిమ్ము మెప్పించుట చతుర్ముఖములుగల బ్రహ్మకైనను నలవిగాదు. అందుచేత వారు తమ ప్రజ్ఞాఇహీనత సభలో వెల్లడి యగునని భయముచే వచ్చుటలేదు" అని ప్రత్యుత్తర మిచ్చుచుండిరి. మహారాజునకీకృత్రిమస్వభావ మెంతమాత్రము దెలియలేదు.

     రాజస్దానములయందును, రాజాంతపురముల యందును, గల వైచిత్రమ్లు వర్ణనాతీరములుగదా!  సేవకులలో సేవకులకు బండితు