ఈ పుటను అచ్చుదిద్దలేదు
72
కాళిదాస చరిత్ర
ఆ పండితులమాటలు వినినతోడనే కాళిదాసుడు "బంగారుపళ్లెరమునకైనను గోడచేరు వుండవలెనుగదా? అట్లే నావిద్యయు మహాపురుషు నాశ్రయించినగాని శోభించదు. ల త వ్యాపించి పుష్పించుటకు మంచియాశ్రయ మేదైన నుండవలయును. కవితాలతకు గూడనట్టి యాశ్రయము కావలయును. అది లేనినాడు శొభింపదు. ఆ యాశ్రయము గొప్పది కావలయును. "నీచాశ్రయిం నక్రర్తవ్యంకర్తవ్యం మహదాశ్రయం" నీచుల నాశ్రయింపగూడదు. గొప్పవాని నాశ్రయింపవలె నను నార్యోక్తినిబట్టి నేటికాలమున జగత్ప్రసిద్దుడై విద్వజౢనులను సత్కతించుచున్న భోజమహారాజు నాశ్రయించెద" నని నిశ్చయించి ధారానగరమునకు బోయెను.
ఆ కాలమున భోజిని యాస్దానమందు బుద్దిమంతులు, కవితాప్రవీణులు, సాహిత్య చక్రవర్తులు నగు పండితులుండిరి. వారి కనర్గళమైన కవితాధారి కలదు. అసాధారణమైనబుద్దిసంపద కలదు. కాని "యాదకో యాచకశృత్రు" అనునర్యోక్తిని బట్టి భోజరాజును సందర్శించుట కేపండితకవులు వచ్చినను వారియందు రాజునకు గౌరవభావము గలుగునేమో యని శంకించి మత్సరము బూని వారికి రాజసందర్శనము గాకుండ జేయుచుందురు. అందులో మొదటివాడేకసంతగ్రాహి, అనగా నేశ్లోకమైన నొకసారి విన్నపక్షమున నది చిరకాలముక్రిందట దనకువచ్చిన పాతశ్లోకమును జదివినట్లే గడగడ కంఠపాఠముగ జదువును. రెండవవాడు ద్విసంతగ్రాహి. అనగా రెండుసార్లు చదివిన నతనికి శ్లోకంవచ్చెడిది. మూడవవాడు త్రిసంతగ్రాహి. అనగా మూడుసార్లు చదివినపక్షమున నతనికి శ్లోకము కంఠపఠముగ వచ్చెడిది. వీరు ముగ్గురు మిక్కిలి యైకమత్యము గలిగి యుండిరి. ఏ కవియైన మహారాజును దర్శింపగొరి ముందుగా వారి యాస్ధాన కవులం జూచుట మంచిదని వారికడకు బోయినప్పుడు వారు