పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


74

కాళిదాస చరిత్ర

లలో బండితులకు, నుద్యోగులలో నుద్యోగులకు నెడ తెగక పరస్పర మత్సరభావములును. అందుచేత ననేకములైన యనర్దములు వాటిల్లుచుండును.

    ఆస్దానమందలి స్దితిగతు లీవిధముగానుండగా భూపాలససందర్శనార్దమై కాళిదాసు డరిగి తక్కిన కవులవలెనే యాస్దానకవులంజూచి నమస్కరించి వచ్చుట సముచితమని భావించి యామువ్వురు నొకచోట నుండగా వారికడకు బోయి భక్తియు వినయములును గదుగుకొన నమస్కరించి  వారి యాశీర్వారములు బడసి తాము కొంచెము కవిత్వము జెప్పగలిగినట్లు వారికి దెలిపి రాజ సందర్శనము జేయింపుమని కోరెను. వారుమువ్వురుంగలిసి కట్టుచున్న భాగవతమంతయు నంతకుమునుపే కాలిదాసుడు బహుజనంబులవలన వినియుండుటచే రసవంతమైన శ్లోకమేదేని జెప్పినపక్షమున నది యదివఱకేయున్నదని వారుతెన్నెగతాళి చేయుదురని తెలిసి వారి కన్నులలో దుమ్ముగొట్టుటకై వెఱ్ఱిమొఱ్ఱిశ్లోకమొకటి రచియించి యిట్లు చదివెను.


శ్లో॥ అస్దివ ద్భకిన చ్బైన చల్లని తెల్లకుక్కచ్వత్,
      రాజతే భోజ తేకీర్తి: పునస్సన్యాసిదంతవత్

      తా॥ఓ భోజరాజా! నీకీర్తి యెముజివలెను, కొంగవలెను, మజ్జిగవలెను, తెల్లకుక్కవలెను, సన్యాసిదంతమువలెను దెల్లగా నున్నది.
     అనకతవకమాటలతో నిండిన యాశ్లొకము వినంగానే వారు చిఱునవ్వునవ్వి "శ్లోకము మిక్కిలి రసవంతముగా నున్నది. రేపుదయము రాజదర్శనము చేయించెదము రండి"  అని యతనిం బొమ్మనిరి. దొంగవాకిట మండమువేసినట్లు కాళిదాసుడు తనకేమియు రానట్లు టొంచి వారి గర్వభంగము చేయదలంచెను. తర్వాత. గవిత్రయ మిట్లాలోచించెను.  "వీడేదో వట్టి వెఱ్ఱిముండకొడుకు వలెనున్నాడు.