Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51

కాళిదాస చరిత్ర

       అనుటయు ముంజరాజు నుక్కిలికోపించి పండ్లు పటపటగొఱుకుచు  "ఓయీ! నీవు రాజువుకావు,నీవు నాభృత్యుడవు. రాజజ్ఞ నిర్వర్తింపని భృత్యులు రాజద్రోహులై దండార్హులగుదురు. కావున నీవు ముందు వెనుక లాలోచించుకొని మాటాలాడుము" అని బెదరించుటయు, వత్సరాజు తనయైశ్వర్యము, తన ప్రాణములుగూడా ముంజునిచేతిలో నుండుటచేత నతడు తనకు గొప్ప యపాయము గావించునని భయపడి యెట్టకేల కాఘాతుకకార్యము చేయుట కియ్యకొనెను. ధనలోభ మెంత దుష్కార్యమునైనౌ జేయించునుగదా?
     అంతట సాయంకాలమయ్యెను. సూర్యబింబము పశ్చిమసముద్రమందు మునిగెను. ప్రతాపవంతుడైన మహీపాలకుడు గతించినతొడనే యనామకులు పెక్కుం డ్రు తలెత్తుదురని తెలియజేయుటకోయను భాను,మండలము పడమటిసంద్రమందు గుంగినతొడనే  మినుకు మినుకు మని చుక్కలు బైలుదేఱెను. దేశపాలకుడైన భూపాలుడు మృతి నొందినతరువాత దేశము దుష్టరాజరకమై మహావిప ధందకారమున మునిగియుండునని తెలియజేయుటకోయన గాఢాంధకారము భూమ్యాకాశ  మధ్యప్రెదేశమున నీలిగుడ్డ పఱచినట్లు,కాటుక వాన గురిచినట్లు, బ్రహ్మండమంతట వ్యాపించెను.అప్పుడు వత్స్దరాజు దుష్కార్యాచరణమందు గృతనిశ్చయుడై, మాయోపాయమున భోజకుమారుని రావించి,తన రధముపై నెక్కించుకొని భువనేశ్వరీదేవతాలయసమీ నకుంగొంపోయెను. మాయయు మర్మము నెఱుగని  భోజుడు కటికవానివెంటనరుగు మెకవలె దనకు రానున్న మహాపత్తునించుకేనియు నెఱుగక, వత్సరాజునందు సంపూర్ణవిశ్వాసముగలిగి వెళ్లెను. నిర్జనమై నిశ్చబ్దమై నిబిడాందకారమయమై యున్న యచ్చోటికరిగినతోడనే వత్సరాజు తన యొరనుండి ఖడ్గ మూడబెఱికి నిర్దయత్ముడై భోజున కిట్లనియె-- "కుమారా! నేను మిక్కిలి