Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

కాళిదాస చరిత్ర

మందభాగ్యుడను. అతి దారుణకృత్యము చేయుటకై వచ్చితిని. జ్యోతిష్కుడు నీజాతకముజూసి నీవు చిరకాలము రాజ్యమేలుదువని చెప్పినదిమొదలుకొని నీ పినతండ్రి మంజుడు చింతాక్రాంతచిత్తుడై నీవు తన కడ్డుగానుండుటంజేసి నిన్నుచంపుమని నన్ను నియోగించెను. ఈ దుష్కార్యము చేయకుండిన తనకు నేననేకవిధముల బ్రయత్నించితిని. ఈ పాపకార్యము నుండి తొలగుమని బహువిధముల వానిని వేడుకొంటిని. ఈ పని చేయకపొదునేని నీ పినతండ్రి నా ప్రాణములు దీయుటకు నిశ్చయించుకొన్నాడు. కావున నాత్మప్రాణసంరక్షణార్దము యీక్రూరకార్యము నేను చేయ నిశ్చయించుకొంటిని. నేను రాజద్రోహిని - దక్కద్రోహిని- స్వలాభమునకై మహాపాపమును జేయుచున్నాను. ఏమైనను నేనది చేయకతప్పదు .మీయమ్మకేదైన జెప్పవలసితివేని వేగము చెప్పుము"

    అతిదారుణమునలై పిట్టపిడుగులు కూలినట్లా పలుకులు చెచినబడినతొడనే భోజుడు మొట్టమొదట  భయముచే నించుక కంపించి, రాచబిడ్డడగుటచే మరల ధైర్యము దెచ్చుకొని యిట్లనియె

శ్లో॥రామేప్రప్రజనం, బలేన్మియమనం, పాండోసుతా
    రాం వనం.
    వృష్టీరాం విధనం, నలస్యనృపతే రాజ్యాత్ పరి
    భంశంన,
    కారాగారపొషేనణంచ మరణం సంచింత్య లంకేశ్వరే
    సర్వ:కాలనశేన నశ్యతి నర:,కోవా పంత్రాయతే

    విష్ణుదేవుని యవతారమైన రాముడు నారచీరలుగట్టి యడనిని వసించెను ముజ్జగంబుల గెల్చిన బలిచక్రవర్తి బంధింపబడెను దేవాంశ సంభూతులైన పాండవులు రాజ్యభ్రష్టులై పలుబాదలు బడిరి. యాదవులు శ్రీకృష్ణుని చుట్టములయ్యు నొకరి నోకరు కొట్టుకొని చచ్చిరి. నలుడు జూదమాడి రాజ్యమును గోల్పోయి ఋతుపర్ణుని రధసారధి యయ్యెను. ఇరువదిచేతులూ బదితలలుగల రావణుడు చెఱలోబడి