కాళిదాస చరిత్ర
ముహూర్తము బెట్టించెను. ఆముహూర్త మెంతచక్కగా యోగించినదో చిత్తగించినారా? రామునకు రాజ్యాభిషేకము లేదు సరికదా భార్యాసమేతముగా వనవాసక్లేశముసంభవించినది. తరువాత సీతాదేవిని రజ్వణాసురు డెత్తుకపీవుట సంభవించినది. దశరధ మహారాజు మృతి నొందెను. భరతశత్రుఘ్నులు పట్టణముబాసి నందిగ్రామములో నుండిరి. కౌసల్యాకైకాసుమిత్రలు వితంతువులైరి. అయోధ్య పాడయ్యెను. ఆ ముహూర్తము బలిమి యట్లుండెను! అదియటుండనిండు ధర్మరాజునకు సకలశాస్త్రవేత్తయైన ధౌమ్యుడు పురీహితుడుగదా! ఆయనబెట్టిన ముహూర్తములేమైనవి? అదిగాక, నలచక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తికి వేదవేదాంగవేత్తలయిన విబుధులు పురోహితులుగా నుండిరికదా! అట్టివారు పెట్టిన ముహూర్తములలో వివాహమాడిన యమహారాజుల కటువంటికష్టములు రానేల! కాబట్టి జ్యోతిశ్శాస్త్రము నమ్నదగినదికాదు. ఆత్మలాభపరాయణులైన పండితులు ప్రశ్నలడుగువారికి సంతోషముగలిగింపదలచియిచ్చవచ్చిన తెఱంగున జెప్పుచుందురు. ఆ పలుకులు నమ్మి మనము వర్తింపరాదు. ఆ పండితుని మాటలనుబట్టి మీరుభోజునివధియింతురనిదేశముమహాసముద్రమువలెఘూర్ణమానమగును. ప్రజలు భోజునియందతి ప్రీతిక్స్లవారు. వారు మహాకంపితులై యెంతపని యైన జేయగలరు. ప్రజాశక్తి యొక్కమారు విజృంభించెనేని మనసిన్యములు, మనయాయుధములు, దానిముందఱ గడ్డిపఱకపాటి నీయవు, ప్రజాప్రీతియే రాజుమూలబలముగా నెంచుకొనవలయుగాని,కత్తులు, కఠారులు, విండ్లు, తూపులు, నమ్ముకొని యుండగూడదు. పశుబలముచే జనులనేలెడు రాజు చిరకాలము సుఖముగా రాజ్యముచేయలేడు. ప్రజావుశ్వాసముమీద నిలచినరాజ్యము స్దిరమైయుండును. ఏ విధముచేత నాలోచొంచినను భోజుని వధించుట సముచితముగాదు”