పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

కాళిదాస చరిత్ర

సింధులరాజునందు మిక్కిలి భక్తిగలవారు. ఆ కారణమున వానికొమారుడైన భోజునకు గడు నానురక్తులు పూర్వమాత్యుడైన బుద్ధిసాగరుడు దేశమునందు మిక్కిలి పలుకుబడి కలవాడు. వానిమాటకున్న చెల్లిబడి యసాధారణమైనది. ఈ కార్యమునందు నకుసాయపడువారెవ్వరు? వంగదేశపు బ్రభువగు వత్సరాజొకడు. నాయందు మిక్కిలి ప్రీతిగలిగలిగి వర్తించుచుండును. అతడుమాత్ర మీ ఘాతుకకార్యము నానిమిత్తమై చేయబూనునా? ప్రాణమిత్రుడైనప్పుడు సాయముచేయడా? అయిన నీవృధాతర్కమేల! వారినిరావించి యాలోచించెదనుగాక!” అనివితర్కించి మనసస్దిమితములేమిచే భోజమైన జేయక తన్య్ంగర్క్షకునిబిలచి వత్స్రజును రావించి మేడమీద నెవ్వరు లేకుండజేసి రహస్యముగా నతనితో నిట్లనియె, “వత్సరాజా! నీ ఉనాకు మిక్కిలి యనురక్తుడవు. నీవునానిమిత్తమై యొకమహాకార్యము సేయవలయును. మిత్రకార్యము వచ్చినప్పుడది యెట్టిదైనను మనుష్యుడు నిశ్శంకముగా దానినిజేయవలయును నాబతుకంతయు దనిమీదనే నిలిచి యున్నది. అదినీవల్లనేగాని మఱి యితరులవల్ల సాధ్యముకాదు. స్వామినిమిత్తము భృత్యామాత్యులు ప్రాణములనైన నర్పింపవలసినది ధర్మగదా! అట్టియెడ నీవు నేబనిచినపపనువుచేయుటకు సందేహింప గూడదు“ అనుటయు వత్సరాజు! “దేవా! మీయజ్ఞ శిరసావహించి యెట్టిపనినైన జేసెద-సెలవిండు“ అనిసవినయంబుగా బలుక ముంజడు వెండియ నిట్లనియె—“ఆమాట నీనోట వెదలుటవలన నాపంచప్రాణములు లేచివచ్చినవి. నీవంటిమిత్రరత్మముండగా నాకార్యసిద్ధి కాకిండునా? ధారాపుర రాజ్యలక్ష్మిని నేను వశపఱచుకొని నిశ్చింతగా బరిపాలింప వలెనని యున్నది. ఇందుకు భోజకుమారు డడ్డముగ నున్నాడు. ఈరాత్రి వానిని భువనేశ్వరి యాలయముకడకు గొంపోయి వధించి