ఈ పుటను అచ్చుదిద్దలేదు
49
కాళిదాస చరిత్ర
వాని శిరస్సు నాకు గానుకగా బంపవలయును. యిదియేనామనోరధము. ఇట్లుచేయవైతివేని నేను ప్రాణములు విడిచెద. మాఱుమాటాడక దీనిం జేయవలయు“
అతిదారుణములైన యప్పలుకులు శ్రవణగోచరములైనతోడనే వత్సరాజు తెల్లబోయి రాజుంజూచి తిట్లనియె- “రాజా! మీయాజ్ఞ నేను శిరసావహొంచవలసిబవాడనే, కాని,దేవరవారియొద్ద మిక్కిలి చనవు గలిగినవాడ నగుటచే నొక్కమాటచెపోదలచుకొన్నాను. ఆగ్రహింపక క్షమించి యాకర్ణింపదగును, భోజునిదగ్గర ధనములేదు, సైన్యములేదు, పరివారములేదు, మిక్కిలి బాలుడు. అతడు జీవించియుండింస మీకేమి యపకారము చేయగలడు? రాజ్యమంతయు మీరే యనుభవించుచున్నారుగదా! అతనునేల చంపవలయును? అతడు పెద్దవాడైనను సైన్యము, ధనాగారము, మీవశమైయున్నదిగనుక మీరతనికి రాజ్యమప్పగింపవద్దు. అందుచే నతనిం జంపటయనవసరము“ అని వత్సరాజు పలుకుటయు, ముంజుడు నాటి యుదయమున జ్యోతిశ్శాస్త్రవిశారదుడైన బ్రాహ్మణుడు తనకడ కరుదెంచుటయు, దాను భోజునిజాతకమతనిచేతికిచ్చి ఫలములు చూడుమనుటయు, నేబదియైదు సంవత్సరములు, నేడునెలలు, మూడుదినములు భోజుడు రాజ్యమంతయు బరిపాలించునని చెప్పుటయు లోనుగాగలవృత్తాంతమంతయు నెఱిగించెను. అదివిని వత్సరాజు నవ్వి యిట్లనియె—-
“ రాజా! కుషింభరుడైన యొకానొక బ్రాహ్మణుడు చెప్పింస జాతక ఫలములనుబట్టియా నీవిట్టికార్యమును దలపెట్టుట? జ్యోతిశ్శాస్త్రముదృశ్యాదృశ్యమని మీరెఱుగరా? పార్వతీశాపముచేత నది సరిగాజరుగదని పెద్దలుచెప్పగామీరువినియుందురు. పూర్వము దశరధ మహారాజు రామునకు రాజ్యాభిషేకముచేయదలచి బ్రహ్మ పుత్రుడు, బ్రహ్మర్షి, సర్వజ్ఞడునైన వసిష్టమహామినిచేత