ఈ పుటను అచ్చుదిద్దలేదు
47
కాళిదాస చరిత్ర
కైనను శక్యము కాదు. అట్టిదో నిరంతరము పొట్టకై నానాకష్టములబడు నేనెంతవాడను? అయునను నాకుబ్దోచినట్లు చెప్పెదను. ఇచ్చటనుండి శ్రీభోజుని దన యధ్యయనశాలకుబంపివేయుడు”
అప్పుడుభోజుడు రాజునానతిచేత నధ్యయనశాలకుంబోవుటయు బ్రాహ్మణు డిట్లు చెపోదొడంగెను:— “గౌడదేశములోగూడ దక్షిణాపధమంతయు భోజుడు నిరాటంకముగా నేబదియైదు సంవత్సరముల యేడుమాసముల మూడుదినములు పరిపాలించును.”
ఆ పలుకులువినగానే ముంజరాజు మొగము మాడిపోయెను. తెలివిగలవాడుగనుక తన విన్నదనమును గప్పిపుచ్చుటకై రాని మందహాసము దెచ్చిపెట్టుకొని సంతోషించినట్లభినయించెను. అనంతరము రాజు బ్రాహ్మణుని బహుమాన మిచ్చిపంపి రాత్రి తాను పండుకొను మేడమీదికి బోయి యొంటరిగ గూర్చుండి యిట్లు విచరించెను. “రాజ్యలక్ష్మిభోజకుమారుంకు జెందిన పక్షమున నేను బ్రతికియుండియు చచ్చినవాడనే. ఇంతబ్రతుకు బ్రతికి, యింత వయస్సు గడపి యెట్టకేలకు బాలిడైన భోజుడు రాన్యపరిపాలనము చేయుచుండగా నేను దీనుడనై వాని నాశ్రయించి యుందునా? ధనములేనిచో నెంతబుద్ధియుండింసనేమి? ఎంతబలముండిననేమి? ఎంతపాండిత్యముండిననేమి? అన్నియు వ్యర్దములుగదా? కావున నేను రాజ్యహీనుడనై నిద్ధముడనై యుండవలెనా, లేకయెపోటిమహైశ్వర్యము గలిగి బందుమిత్రసపరివారములచేత గౌరవింపబడుచుండవలెనా? ఇన్ని మాటలెందుకు? భోజుడు రాజ్యముచేయవలెనా, నేను రాజ్యము చేయవలెనా? భోజుడు రాజ్యముచేయునేని నేను జీవించియుండగూడదు. నేను వసుంధర బరిపాలితునేని భోజుడు నాకడ్డముగ నుండకూడదు. ఇది సాధ్యమగుటెట్లు? బ్రయత్నించినచో సాధ్యముకానికార్యమేమున్నది. భోజుని గడతేర్చు నుపాయమేది? ప్రజలు