ఈ పుటను అచ్చుదిద్దలేదు
46
కాళిదాస చరిత్ర
శ్లో॥మాతేవ రక్షతి,పితేవ హితే నియజ్త్గే
కాన్తేవ చాభిరమయ త్యవనీయ ఖేదం
కీర్తిం చ దిక్షు వితనోతి, తనోతి లక్మిం
కిం కిం నసాధయతి కల్పలతేన విద్యా?
తా॥విద్య తల్లివలె రక్షించును. తండ్రివలె మంచి మార్గమున బ్రవేశపెట్టును. కాంతవలె భేదమును బోగొట్టి యానందింపజేయును. కీర్తిని దిక్కులయందు వ్యాపింపచేయును. సంపద గలిగించును. అది కల్పలత వలె సమస్తము నొసగును. విద్య సాధింపజాలని దేమున్నది?" అనిపలికి యామహావిద్వాంసునకుత్తమ జాతి గుఱ్ఱముల బదింటిని బహుమానముగా నొసంగెను. అప్పుడు సభలో గూర్చుండిన బుద్ధిసాగరుడను మంత్రి యిట్లనియె---"మహారాజా! భోజుని జాతక మీపండితున కిచ్చి యాతని జన్మఫలము నడుగవలయునని కోరుచున్నాను" అనవుడు మంజుడు మంచిదని భోజుని జన్మపత్రికను దెప్పించి యాబ్రాహ్మణునకిచ్చి దాని ఫలములు జెప్పమని యడిగెను. ఆపత్రిక నందికొని పండితుడు "విద్యాశాలనుండి భోజు నొక్కసారి పిలిపింపు" డని కోరెను. ముంజురాజు భోజకుమారు నధ్యయనశాల నుండి తీసికొనిరమ్మని సేవకుల నంపను. ఆభటులతొ నారాజనందనుడు సభ బ్రవేశించి తండ్రితొ సమానుడైన మంజునకు మిక్కిలి వినయమున నమస్కరించి యుచితాసనమును గూరుచుండెను. ఆసబామంటపమున నున్న రాజకుమారమండల మంతయు భోజుని నిరుపమానసౌందర్య లావణ్యములజూచి యచ్చెరుఫడెను. భూమండలమును సందర్శింపవచ్చిన మహేంద్రుడో, పూర్వాకారమును ధరించివచ్చిన మన్మధుడో, మూర్తిమంతమైన సౌభాగ్యమో, యనునట్లు వెలయుచున్న యా రాకుమారుని దేరిపారంజూచి పండితుడిట్లైయె-- "రాజా భోజుని భాగ్యొదయ మిట్టిదని వర్ణించుటకు నాలుగు మొగములు గల బ్రహ్మ