ఈ పుటను అచ్చుదిద్దలేదు
44
కాళిదాస చరిత్ర
అపవాదనుమాట యటుండగా రాజ్యలక్ష్మియైన మంజుడు తన కడ్డముగా నున్న భోజుని విషప్రయోగా దులవలన జంపును. అట్టియెడ గుమారునకు రాజ్యమిచ్చినందువలన లాభములేదు మీదమిక్కిలి పుత్రహానియు వంశనాశనముగూడ సంభవించును. పోనీ! ముంజునికే రాజ్యమిచ్చిపోవుదమన్న, నాకడుపునబుట్టి యాగర్భశ్రీమంతుడై కడుగారాబమున బెరిగిన భోజుడు నిర్భాగ్యుడై, దిక్కుమాలినవాడై, నిరాధారుడైఫోవునుగదా
శ్లో॥లోభాత్ క్రోధ: ప్రభవతి, క్రోధాత్ ద్ద్రోహ: ప్రవర్తదే
ద్రోహేం నరకం యాతి శాస్త్రజ్ఞపి విచక్షణ
తా॥లోభమువలన క్రొధముపుట్టును. క్రోధమువలన ద్రోహము జనించును. శాస్త్రములు దెలిసిన పండితుడుగూడ ద్రొహమువలన నరకము జెందెను.
శ్లో॥మాతరం పితరం పుత్రం భ్రాతరం నాసుహృత్తమం
లోభావిష్టోనరో హంతి స్వామినం నా సహోదరం
తా॥లోభప్రేరితు డైనమనుష్యుడు తల్లిని, గొడుకును, సొదరుని, స్నేహితుని, దన యజమానునిగూడ నిస్సందేహముగా జంపివేయును.
"అయినను రాజ్యము ప్రస్తుతము మంజునకిచ్చి భోజుని వాని కప్పగించెదను" అని నిశ్చయించుకొని తమ్ముడగు మంజుని బిలిపించి రాజ్యభారమతని కప్పగించి, కుమారుని వానితొడపై గూరుచుండబెట్టి వాని చేతిలో జేయివైచి యప్పగించెను.
పిమ్మట గొన్నినాళ్లకు సింధులమహారాజు స్వర్గస్దుడయ్యెను. ముంజుడు రాజ్యభారము వహించి, చిరకాలమునుండి మంత్రియై, రాజవంశముయొక్క మేలుకొరుచుండి,సింధులమహారాజునకు బరమాప్తుడై, ప్రజలకు మిక్కిలి యిష్టుడైన బుద్ధిసాగరుడను మంత్రి