43
కాళిదాస చరిత్ర
సహింపరు గావున గాళిదాసు మృతినొందిన యేడుగడియలకే భోజుడు కాలధర్మము నొందును. కావున వాణీ పంకజాసదులు మరల నొకచోట గూడుదురు నాటకము విఘ్నమొందినది. గావున జగన్నాటక సూత్రధారుడైన నా పలుకులు గౌరవించి మెరందఱు యధాస్దానములకు దయచేయుడు"
ఆ గోవించుని యాజ్ఞప్రకారము బృందారకులందఱు దమతమ మందిరంబులకు జనిరి. అనంతరము తమతమ శాపముల ప్రకారము బ్రహ్మ, సరస్వతి, దుర్వాసుడు, సావిత్రి, పుంజికస్దల మధ్యమలోకమున జనన మొందిరి.
భో జ రా జు వృ త్తాం త ము
పూర్వకాలమున ధారానగరము
రాజధానిగా జేసికొని మాళవ
దేశమును సింధులుండనురాజు పాలించుచుండెను. అతడు చిరకాలము సంతానములేక తపించుచుండ ముసలితనమున నొక కుమారుడు కలిగెను. ఆ కుమారుని పేరు భోజుడు ఆకుమారుడైదేండ్ల ప్రాయముగలవాడైనప్పుడు వార్దకముచేత దనకు గాలము సమీపించుచున్నదని తెలిసికొని యిట్లు విచారించెను. "అయ్యో! నాకు మరణమాసన్నమగు చున్నది. కుమారుడు పసిబాలుడు. నాతమ్ముడు ముంజుడు మహాబలసంపన్నుడు.వానికన్నెప్పుడు రాజ్యముమీదనేయున్నది. నాకు వెఱచి యతడేమియు జేయలేకయుండెనుగాని, లేనిచో నత డెట్టిపనికైన సాహసించును. రాజ్యము ముంజుని కప్పగింపక నాకుమారునికిచ్చితినేని ముక్కుపచ్చలారని యాపసిబాలుడు దానిని నిలుపుకొనగలడా? విశేషించి నాకు లోకమునం దపవారము గలుగును.