ఈ పుటను అచ్చుదిద్దలేదు
7]
45
కాళిదాస చరిత్ర
నుద్యోగమునుండి తొలగించి తగిన లోకానుభవము లేనట్టియు, నధికారగర్వితుడైనట్టియు, జనరంజనము చేయలేనట్టియు, మఱియొకనిని వానిస్దానమున బ్రవేశపెట్టెను. రాజనందనుడైన భోజుడు గురువులకడ విద్యాభ్యాసము చేయుచు, బహుశాస్త్రసాంప్రదాయముల వినుచు బాల్యము గడపుచుండెను.
ఒకనాడు ముంజుడు నిండుకొలువుదీర్చియుండ సకలవిద్యాచాతుర్యవంతనుడును, జ్యోతిశ్శాస్త్రపారంగతుడును నగు బ్రాహ్మణు నొకడు సభా మంటపమున బ్రవేశించి మహారాజునకు స్వస్తి చెప్పి రాజానుమతమున దగిన యాసనముమీద గూర్చుండి యిట్లనియె. "రాజా! నేను బహుశాస్త్రంబుల జదివితిని. లోకులు నన్ను సర్చజ్ఞడందురు కావున మీకిచ్చ వచ్చిన ప్రశ్న నేదేని నన్నడుగుడు" అని పలుకుటయు రాజు,పండితు డహమభావముచేత నట్లనుచున్నాడో, లేక నిజముగా నతడు లోకులనుకొనునట్లు సర్వజ్ఞడో తెలిసికొనదలంచి "అయ్యా! నేను జన్మించినది మొదలుకొని నేటివఱ కేమేమిచేసితినో యదియెల్ల మీరు సరిగా జెప్పితిరేని మెరు సరవజ్ఞబిరుదమునకు దగినవారే యని నేనొప్పుకొందు" నని వచియించెను. ఆ పండితుడు ముంజుడు పుట్టినది మొదలుకొని యానాటివఱకు జేసిన సమస్తకార్యములనుగూడ వ్యాపారసహితముగ వరుసగా జెప్పెను. రాజు, పండితుడు జెప్పినవన్నియు సరిగా నున్నవని తెలిసికొని చాల సంతొషించి యతని పాదములపైబడి భక్తి తత్పరుడై యిందనీల పుష్యరాగ వైడూర్యమరకతమనిమయ మైన సింహాసనమున నతని గూర్చుండబెట్టి యిట్లనియె---
"ఆహాహా! విద్యాప్రభావ మేమని వర్ణింతును! దానికిసాటి మఱియొకటికలదా?