కాళిదాస చరిత్ర
గాయుచు పందులమందలం దొలుచు పెంపుడు తల్లి దండ్రుల విద్యయగు దొమ్మరవిద్య నేర్చుకొని గడలెక్కి యాడుచు గాలక్షేపము సేయుచుండెను.
ఆ కాలంబున బాంచాలదేశంబును ధర్మవర్దనుడను మహారాజు పాలించుచుండెను. అతినికి శారదయను నొక పుత్రిక కలదు. ఆబాలికమేధాశాలిని యగుటచే జనకుడు శాస్త్రవిద్యాపారంగతురాలిం జేయదలచి సార్దకనామధేయుడగు మేధానిధి యను బ్ర్రాహ్మనుని బిలిపించి యామెకు విద్య సెప్ప మని నియోగించెను. ఆ వి ధ్యా ని ధి చెప్పినదంతయు నందిపుచ్చుకొనినట్లు రాజపుత్రిక క్షణమాత్రములొ నేర్చి, సహజపాండిత్య మామెకు భగవంతుడు ప్రసాదించెనో యనునట్లు స్వల్పకాలములోనే పాండిత్యము సంపాదించెను. పదమూడేండ్లు వచ్చునప్పటికి శారద విద్యావిశారదయై, సంగీతసాహిత్యములయందు నిరుపమాన ప్రజ్ఞ కలదియై , రూపముచేత నేత్రములకు, ఘనపాండిత్యముచేత మనస్సుకు, గానవిద్యాప్రౌఢిమ చేత శ్రవణంబులకు బండువుచేయుచు బందుమిత్రుల కానందము కలిగించుచుండెను. నవయౌవనంబు ప్రాసించుచున్న కూతుంజూచి రాజు విద్యాభ్యాసము మానిపింప దగిన సమయము వచ్చినదని, గురువునకు దక్సిణనొసంగి సెలవుగైకొనిరమ్మని ధన కనక వస్తువాహనంబులిచ్చి కూతును మేధానిదికడకు బంపెను. రాజపుత్రికయు దానుదెచ్చిన సమస్తవస్తువుల నర్పించి, నమస్కరించిపోవుటకు సెలవిమ్మని యడుగ నాతడు నెఱజవ్వని యగు నమ్మద్దియని జూచి మోహ పరవశుడై, కామబాణపీడితుడై, మనంబు బట్టజాలక, మహారాజపుత్రికయని సందేహింపక, "నాకునగ లెందుకు?నీయౌవనంబె నాకు గురుదక్షిణగ నిమ్ము, నిన్ను గౌగిలించుటయె నాకుద్రైలోక్యసామ్రాజ్యము, నిన్ను ముద్దాడుటయే నాకు మోక్షము, నీసాన్నిధ్యమే