31
కాళిదాస చరిత్ర
దన నవ్వులవంటి పువ్వులు పూజార్ద మర్పించుచు గ్రమక్రమంబున నతనిమనస్సు గరిగించి కామాయత్తునిం జేసి తనవలలో వైచికొనియె. మనోరమ యను సార్దక నామధేయముదాల్చిన మనోరమను గూడి యమ్మహాముని సర్వనియమంబులత్యజించి భోగియై యాకాంతవలన నొక కుమారునింగనియను. కుమారుడు కలిగినపిదప నతని కెక్కడలేని పశ్చాత్తాపము కలిగెను. దేవవేశ్య వాని వ్రతభంగముజేసి కృతకృత్యురాలై భూలోకంబు విడిచి నాకంబునకరిగెను.
'లంజకు పిల్లతెగులన్న ' సామెత నిజమయ్యెగదా! కన్నకొడుకను ప్రేమగాని, కనులు తెఱువని గ్రుడ్డుగదా యను జాలిగాని, లోకులేమనుకొందురో యను శంకగాని, పాపభీతిగాని లేక యా వేశ్య యెంతపని చేసెనో చూచితిరా? సకలవిద్యాపారంగతుడై, భూతదయాపరుడైన ముని మాత్ర మేమిచేసెను. స్త్రీదక్షతలేని బిడ్డను పెంచుట దుస్సాహసమని యావిడదారి బిడ్డనొక పొదరింట బువ్వుల పానుపుమీద బండుకొనబెట్టి తనదారింబోయెను. పసిపాపడు కావుకావుమని యేడ్చుచుండ జూచువారుగాని, యగ్గునెట్టువారుగాని, చన్నిచ్చి పాలుగుడుపువారుగాని లేరైరి. 'ఎవరికి బుట్టిన బిడ్డగా వెక్కి వెక్కి యేడ్చుచున్నా ' డన్నసామెత నిజమయ్యెను. అక్కడికి దగ్గఱగా నొక కొండక్రింది నొకపల్లె యుండెను. ఆపల్లియలో దొమ్మరి వాండ్రు కాపురముండిరి. ఎక్కడో యాటలాడి దొమ్మరి వాండ్రు కొందఱు తమ సానులతొగూడ మరల దమ యూరికి బోవుచు, మార్గమధ్యమున దట్టమగు పొదలంట కావుకావుమని యేడ్పు వినబడ జెచ్చర నచ్చోటికిబోయి లావణ్యపుంజమగు నాశిశువుంగనుం గొని యెత్తుకొని ముద్దాడి వానిం బెంచుకొనదలచి తోడ్కొనిపోయిరి. నాటనుండి యబ్బాలుడు తలిదండ్రుల లోపంబున దొమ్మరివారిబిడ్డయై విద్యా విహీనుడై క్రమక్రమంబునం చెరిగి బూడిదలో బొరలుచు గాడిదల