పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33

కాళిదాస చరిత్ర

స్వర్గము నాయందు భక్తగలదేని యయ్యది నాకు లభింపజేయుము అని యడిగెను. రాపుత్రిక సువర్ణ చ్చాయగల తనమొగము జేవురింప నేత్రము లెఱ్ఱజేసి "ఛీఛీ! నీవు బ్రాహ్మణుడవుకావు, ఛండాలుడవు నీమొగము చూడరాదు" అని కోపించిన యాడుయేనుగువలె నత్వరితగమనంబున నంత:పురంబు బ్రవేశించెను. మేదానిధి భగ్న మనోరధుడై, రాజపుత్రికకు సమయమువచ్చినప్పు డపకారము చేయవలెనని పగబట్టియుండెను. 'కానిమాట కప్పిపుచ్చవలె ' నని లోకోక్తిప్రకరము శారద యా బ్రాహ్మణాధము డాడిన మాటలు తలిదండ్రుల కెఱింగింపకపోయెను. అత గొన్ని నాళ్లకు శారద సంప్రాప్త మౌనసమయ్యెను. వివాహము నిమిత్తము తండ్రి కొన్ని సంబంధములు వెదకి తన కుమార్తెకు మంచిపండితుని, రూపవంతుని దెచ్చి పెండ్లి చేయవలెనని నిశ్చయించి తనకాప్తుడైన మేధానిధిని బిలిచి చక్కదనము గలిగి, సౌర్యమార్య్లముగలిగి, నవయౌవనంగలిగి, విశేషించి పాండిత్యముగల యొక పెండ్లికొమారుని దెమ్మని చెప్పెను. తన పగదీర్చుకొనుజ్టకవకాశము గలిగినది గదాయని మేధానిది మిగుల సంతసించి ప్రయాణ వ్యయములకుగాను కొంత ద్రవ్యము సేకరించి, నానా దేశములు సంచరించి, బహు పట్టణంబులు,పలు పల్లియలు జూచి యందు దనకు నచ్చిన మూడాగ్రేసరుడు లభింపమి నిరంతర ప్రయాణంబులు జేసి దైవవశమున దొమ్మరి పల్లియకు బోయి త్రికాలవేది పుత్రుడైన యాబాలునిజూచి వీడే తగినవాడని నిశ్చయించి యాదొమ్మరులకు గొంతద్రవ్యమిచ్చి వానిని దనవశము జేసికొని ,మోట పశువును మెల్లగాదువ్వి సాధువుజేసికొనునట్లు వానిని మంచిమాటల చేత మెత్తపఱచి వానిమెడలో జందెములువైచి యిట్లనియె "ఓరీ! నీ పున్యము పుచ్చినది. నీ రొట్టే నేతిలో బడినది. నీభాగ్యము పండినది. నీకొక మహారాజుకుమార్తెను వివాహము చేయిచెదను.