159
కాళిదాస చరిత్ర
దనకారోపించుకొని నావలన నర్ధరాజ్యము బుచ్చుకొనవలెనని కాళిదాసు సమ్మతిమీదనో, వానిని వంచించియో యిదిగ్రహించి కాళిదాసు ప్రయోగించిన శబ్ధమేదో తుడిచివైచి దానికిబదులుగా ‘రాజే ‘ యనుశబ్ధమును జేర్చియుండవచ్చును“ అనిమనంబున వితర్కించి విలాసవతింజూచి “ఓసీ! యిది నీకవిత్వముగాదు. కవిత్వమునకును నీకును నూఱామడదూరము. కవనమెన్నడు నీవఱకు నీవు చెప్పితుండలేదు. ఇదికాళిదాసు కవిత్వమని యాకల్పనమే చెప్పుచున్నది. కాళిదాసెక్కడ నున్నాడు? వానికేదేని ద్రొహముగావించి యీశ్లోకము దెచ్చితివా! లేక వానిసమ్మతిమీద దెచ్చితివా వెంటనే చెప్పుము? చెప్పవేని నినిప్పుడే భయ్ంకరములైన దండనలపాలు చేసెద“ నని భ్యంకరముగా రూక్షనిరీక్షణుడైయడుగ విలాసవతి గడగడవడకుచు సాక్ష్యాద్యమధర్మరాజువలె నున్న యామహారాజు పాదములపైబడి యేడ్చుచు నిట్లనియె- “మహాప్రభూ! అర్ధరాజ్యము నేనుగ్రహింపవలెనని దురాశచే గాళిదాసుని నిన్నరాత్రి చంపితిని. నేను పాపాత్మురాలను. ‘బాలే బాలే తనముఖాంభోజే ‘ యని యతడు సమస్యనుబూరించెను. ‘బాలే ‘ యనుమాట దీచివైచి ‘రాజే ‘ యని నేనుచేర్చితిని. నేనుపాడుముండను. పాడుపనిచేసితిని. నన్నుమీచిత్తమువచ్వినశిక్ష వేయింపుడు.”
కర్ణకఠోరమైన యావజ్ర్త పిడుగుపాటువలె జెవి సోకినతోడనే రాజు సింహాసనముమీఅనే మూర్చుల్లెను. సభాసదు లందఱు గన్నీపాలై పాఱుద్:ఖించిరి. ఆహా! ‘స్త్రీబుద్ది ప్రళయాంతక! ‘ అనుమాట నిజమయ్యెనని కొందఱుపలికిరి. ఈదుర్మాత్మురాలిని ముక్కముక్కలుగా గోసి కాకులకు గ్రద్దలకు నెగురవేయుడని మరికొందఱు భాషించిరి. పరిచారకులు చల్లనినీరు, పన్నీరు ముగమునజల్లి శైత్యోపచారములు చేయుటవలన రాజు మూర్చనుండి తేఱి యిట్లువిలపించెను, “హా! మహాపండిత, హా! లోకైకమహాకవి, హా! దేవీ వరప్రసాద, హా!