పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
170

కాళిదాస చరిత్ర

సమస్యాపూరణచక్రవర్తి, హో!సాహితీ కవితాసార్వభౌమ, హా! అగతానాగతవర్తమాననేది, హా! అష్టభాషాశబ్దశాసన, హో! ఉమాసరస్వతీ, హో!లోకోత్తర చరిత్ర, నీవంటిమహాకవిని గొలుపోయిన నాకీలోకము మెందుకు? రాజ్యమెందుకు? పురమెందుకు, నంతిపురమెందుకు? కిరీటమెందుకు? సింహాసనమెందుకు? నేనునీతోవచ్చెద. ఇంకలోకమున సత్కవిత్వము చచ్చినది. పాండిత్యము భగ్నమైనది. విద్యలు విచ్చిమొగ్గయినవి. సమస్యలడుగంటినవి. సరస్వతి నేడుదిక్కులేనిదైనది. కవితాకన్యక నేడనాధయైనది. సరసకవిచంద్రుం డస్తమించినాడు. ఇక జగ మంధకారమైనది. నాసభాలంకారము తొలగిపోయినది. ధారానగరము పండితశూన్యమైనది. ఇంక నేను జీవింపజాల" నని వగచి వగచి మఱల మూర్చవోయెను. మూర్చానంతరమున నతనికి బూర్వజన్మవృత్తాంతము స్మరణకు రాగా గాళిదాసుడు పోయిన యేడుగడియలకే తనకు మరణమున్నదని గ్రహించి దానికి వలయు ప్రయత్నములు జేయించెను.

భోజుని మరణము

కాళిదాసు మరణించెననియు

భోజుడుగూడా బలన్మరణము నొందుచున్నాడనియు వి ఇనతోడనే ధారానగరమంతటను హాహాకారములు చెలగెను. భోజమహారాజు ప్రజలకు దండ్రివంటివాడై భూమి పాలించినందున నెల్లవారును దమయాప్తబంధువు డెవరో నొందుచున్నట్లు మహాదు:ఖితులైరి. అంత:పురమంతయు హాహాకారములతో బ్రతిధ్వనించెను. సభయంతయు గవిపండితామాత్య ప్రముఖుల భాష్పధారలచే వర్షము గురిచినట్లుండెను. మహారాజాజ్నచే