ఈ పుటను అచ్చుదిద్దలేదు
168
కాళిదాస చరిత్ర
రాజుతోజెప్పియుద్ధరాజ్యము తానే గ్రహింపవలెనని సంకల్పించెను. ఆహాహా! చూచితిరా దాని దౌర్జన్యము తన్ను నమ్మి చిరకాలము తన సహవాసముచేసి తన్ను సుఖపెట్టి మహారాజిచ్చిన బహుమానవట లన్నియు దనకే యిచ్చి తన్ను స్వభార్యగా గాళిదాసుడాదరించినను వేశ్య విశ్వాసములేక పాపభీతి లేక యాశాపిపిశాచగ్రస్ధయై మహాపండితుడై, నిరుపమానకవియై, లోకోత్తరప్రభావుడై, యద్వితీయ ప్రతిష్ఠాసంపాదకుడై, విశేషించి బ్రాహ్మణుడైన యా కాళిదాసూగాఢనిద్రాసమయమున ఖడ్గముతొ నొక్క వ్రేటున దెగవేసి చంపను. చంపి కాళిదాసుడు పూరించిన శ్లోకభాగములోని దననుద్దేశించి చెప్పబడిన 'బాలే ' యనుమాట దీసివైచి భోజరాజు నుద్దేశించి తాను చెప్పవలెనని 'రాజన్ ' అనుటకుబదులుగా 'రాజే ' యనుమాట జేర్చి "రాజే! తనముభాంభోజే దృష్ట మిండీవరద్వయోమ్మని వ్రాసెను.
మఱునాడుదయమునకు గాళిదాసుని శవముఇన్న గదికి గట్టితాళమువైచి భూర్జపత్రము మీద నాశ్లోకము వ్రాసుకొని కొలువుదీర్చియున్న మహారాజు దర్శనము జేసి 'దేవా! దేవరవారిచ్చిన సమస్య నేనుపూరించితిని. మీద దేవరివారిచిత్తము" అని విన్నవించి శ్లోకము జదివెను. అదినంగానే మహారాజూన కనుమానము గలుగ నతడిట్లు వితర్కించెను-" ఉపమాన మాకాళిదాసునిదై యున్నది. లలితపదప్రయోగమా యామ్మహాకవిదే. సమస్య నతడే పూరించియుండును, ఇంతచమత్కారముగా దానిం బూరించువారు ప్రపంచమున లేరు. ఈపణ్యాంగణకింత తెలివితేట లెక్కడివి? అనన్యసాధ్యమైన యిట్టికల్పన దీని నోటి నుండి రాగలదా? కానీ! కాళిదాసే పూరించిన పక్షమున 'రాజే ' యను తప్పుశబ్ద మతడు ప్రయోగించి యుండునా? ఈ స్వల్పశబ్దదోషమా మహాకవికి దెలియదా? సౌర్యాసౌర్యములు విచారింపగా సమస్య కాళిదాసుడే పూరించియుండుననియు, నీవేశ్య శ్లోకకర్తృత్వము