ఈ పుటను అచ్చుదిద్దలేదు
167
కాళిదాస చరిత్ర
యుపాయములేదు" అని యీక్రిందిశ్లోకార్ధము నావెలయాలి మంచముప్రక్కనున్న గోడమీద స్వహస్తముతో లిఖించెను.
శ్లో॥ కుసుమే కురుమోత్పత్తిశ్శ్రూయతే నచ దృశ్య్హతే
తా॥పువ్వునందు బువుపుట్టుట వినలేదు,కనలేదు.
అనివ్రాసి యీసమస్య వెవ్వండుపూరించునో వానికర్ధరాజ్యమును భోజుడిచ్చుచున్నాడని కూడ దానిక్రింద సంస్కృతములో వ్రాసి వేశ్యాగృహమును విడిచి నిజమందిరమున కరిగెను.
ఆరాత్రి భోజనృపాలు డూహించినట్లే కాళిదాస మహాకవి వెలవలది యింటికి బోయి రాజు తననిమిత్తమై వచ్చిన వృత్తాంతము బ్రియురాలు చెప్పంగా విని యతనికి వెండియు బశ్చాత్తాపము జనించినందుకు సంతసించి యతని మనోరధసిద్ది చేయదలంచి సమస్య నీక్రింది విధముగా బూరించెను.
"బాలే! తనముఖాంభోజే దృష్ట మిందీవరద్వయం"
తా॥ ఓ బాలా! (ఓప్రియురాలా!) నీముఖమనెడు తామరపువ్వునందు నల్లకలువపూవులజంట కనబడుచున్నది. అనగా బూవులో బువ్వుపువ్వు పుట్టుట లోకమునందెచ్చటను లేకపోయినను నేటి కాఅమున కది కనబడుచున్నది. ఎట్లన, నీమొగమనెడి తుమ్మిపూవునందు గన్నులనెడు రెండుకలువపూవులు మొలచినవి. పుష్పమందు బుష్పము పుట్టుట యసంభవమైనను నీయందు నిజమైన దని భావము.
'బాలే ' యనుమాట బోగముదానినిగూర్చి కాలిదాసు చెప్పెను. దానియందలి ప్రేమాతిశయముచే దానినే యిందువర్ణీంచెను. శ్లోక మతిరమణీయముగా నుండుటచేత వేశ్యకు దుర్భుద్దిపుట్టెను. కాళిదాసుడు సమస్యను బూరించినాడని విన్నపక్షమున రాజు వాని కర్ధరాజ్యము తప్పక తన వాగ్ధానముప్రకార మిచ్చివేయునని దురాశాప్రేరితురాలై యాగణిక కాళిదాసునుం జంపి యా సమస్య తానే పూరించినట్లు