Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కా ళి దా సు ని మ ర ణ ము

కాళిదాసుడు నిర్ధోషియయ్యు భొజ

రాజున కనిష్టుడై విలాసవతీమందిరంబడ

గొన్నిదినములు కాలక్షేపము సేయునప్పటికి భోజమహారాజునకు వెండియు మనంబున బశ్చాత్తాప ముదయించెను. ఉదయించినతోడనే దేశమందలి నానాభాగములకు దనసేవకులబంపి వెదకింపజొచ్చెను. ఎచ్చటను గానంబడలేదు. విలసవతీగృహంబుననె దాగియున్నాడని కొందఱు వక్కాణించిరి. ఆమెయింట లేడుగాని యనుదినమును రాత్రులయం దామె గృహంబునకు వచ్చిపోవుచుండు నని కొందఱనిని. రాజాస్ధానము రోసి,ముక్తిప్రదాయకములైన పుణ్యతీర్ధములను సేవించుటకై దేశాంతరముబోయెనని కొందఱుచెప్పిరి. పలువురు పలు తెఱంగుల బల్కుచుండుటచే నెద్దియుం దోచక భోజభూపాలుడు కృపాళుడై కాళిదాసువియోగ దు:ఖ మతిమతిశయ మగుటచే నతడు తప్పక వేశ్యా గృహంబునకు వచ్చిపోవుచుండునని నిశ్చయించి సపరివరముగా దానిగృహంబునకుజని కాళిదా సెఛ్ఛట నున్నాడని యడిగెను. "దేవా! యాతని జాడ నాకు తెలియ"దని యావెలయాలుత్తరము చెప్పెను. దానిమాటయందు విశ్వాసములేక రాజు తనలో నిట్లు తలంచెను-- "కాళిదాసుడు బ్రతికియున్నాడని నాకు నమ్మకము. బ్రతికియున్న పక్షమున దీనియింటికి రాకపోడు. దీనియందతడు బద్ధానురాగుడు. కావున దీని లోపలి గది గోడమీద నేనొక శ్లోకములో సగముభాగము వ్రాసి పోయెద. అది చూచినపక్షమున దానికి బ్ర్లత్యుత్తరము గా నతడు తక్కిన సగముశ్లోకమును బూరింపకపోడు. సమస్యాపూరణమునందతనికి నిరుపమానమైన ప్రజ్ౙ కలదు. గావున నీ సమస్య నతడే గాని పూరింపలేడు. గావున నతడు తప్పక బైలుపడును. ఇంతకన్న నిరపాయమైన