Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
22]

165

కాళిదాస చరిత్ర

వన్నెకెక్కుకాలము వచ్చినదని, తనకు స్ధిరయశస్సు గలుగు సమయము వచ్చినదని సంతసించి భొజమరాజున కాచిత్తరువును సమర్పించెను. మహారాజు దానినిజూచి "ఆహాహా! ఎంత చక్కగా వ్రాసితివి. కలకలనవ్వినట్లు కనులు దెఱచి చూచునట్లు, నొరుదెఱచి మాటాడుచున్నట్లు వేయేల జీవకళ యుట్టి పడునట్లులిఖించితివి.ఈవఱకెందఱనో చిత్రకారులు జూచియుంటినిగాని, తల వెండ్రుకనుబట్టి చిత్తరువు లిఖింపగల యసాధారణ ప్రజ్ఞాశాలిని జూడలేదు. సరిగదా యట్టివాడున్నవాడని విననైనలేదు. కాని, తొడమీద నల్లమచ్చ వైచితివెందుచేత?" నని యడిగెను."దేవిగారి కచ్చట నొక పుట్టుమచ్చ యున్నది. దానిం జూపుటకై కస్తూరితో నక్కడ నొకచుక్కబెట్టితి" వని రాజడిగెను. "కాళిదాసుడు చెప్పె"నని చిత్రకారుడుత్తరమిచ్చెను.

   ఆక్షణమే రాజు కాళిదాసును బిలిపించి "దేవి కుత్సంగతలమున నొక పుట్టుమచ్చ యున్నమాట నీవెట్లెఱిగితి" వని యడిగెను. అప్పుడు కాళిదాసు తత్తఱపడక వినయంబుగ దుర నిట్లుత్తరము చెప్పెను-- "దేవా! ఆగ్రహింపక చిత్తగింపుడు. పద్మినీ జాతి స్త్రీలకు నుత్సంగతలమున ఇట్టి పుట్టుమచ్చ యుండును. ఈ విషయము సాముద్రిక శాస్త్రవేత్తలకు "దెలియును, ఆశాస్త్రమునుగూడ నేను చదివినవాడ నగుటచే నేనిట్లుజెప్పితిని. మీదదేవరాయని చిత్తము" అనిచిత్తరువు యొక్క మొగము మీది తిలకము తొడమీద బడుట మొదలగు వృత్తాంతమంతయు జిత్రకారుడు తనతొజెప్పినప్రకారము రాజుతో, గాళిదాసుడు చెప్పెను. చిత్రకారు డదియంతయు నిజమని పలికెను. 
    మహారాజునకు గాళిదాసునిపై ననుమానము కలిగెను. అతడంత:పురద్రోహియని నిశ్చయించి  రాజు తనదేశమునుండి వెడలిపొమ్మని యానతిచ్చెను. కాళిదాసుడు మంచిదని నిర్విచారముగ విలాసవతీ గృహంబునకుబోయి యచ్చట దలదాచుకొని కాలక్షేపము సేయజొచ్చెను.