పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
164

కాళిదాస చరిత్ర

దేవరవారు నాలేఖనము జిత్తగించి పరీక్షించి అనుగ్రహింపవలయునని ప్రార్ధించుచున్నాను. ఈవఱకు ననేక మహారాజుల యాస్ధానములకరిగి నాప్రజ్ఞావిశేషములు వారికి జూపి మెప్పును వడసి యున్నవాడను, శారదానృత్యమునకు రంగస్ధలాలైన మీ యాస్ధానమును గూడ మెప్పువడయ వచ్చినాడ" అని విన్నవింప రాజు వాని ప్రజ్ఞను శోధింపదలచి యొక పరిచారికంబిలిచి లీలావతీదేవియొక్క తలవెండ్రుక నొకదానిని దెప్పించి చిత్రకారునికిచ్చి తనపట్టమహిషి యగు లీలావతీదేవి చిత్తరువు నిర్మింపుమని యానతిచ్చెను. వల్లెయని చిత్రకారుడు స్వల్పకాలములోనే చిత్తరువువ్రాసి సంపూర్నముచేసి కస్తూరితో నాబొమ్మనుదుట బొట్టుపెట్టెను. వెంటనే యా తిలకము మొగమున నిలవక తొడపైబడెను. మరల నతడు మృగనాభితో లలాటమున దిలకముదిద్ద నదియు నట్లే విగ్రహముయొక్క యుత్సంగముమీద బడెను. ఎన్నిసారులు ప్రయత్నించినను నట్లేయయ్యెను. చిత్రకారుడు తన కవమానము గలుగునట్టి కాలముసమీపించినదని మిక్కిలి విచారించి యేమిచేయుం దోచక తిరుగులాడుచు దైవవశమున నొకానొకప్పుడు కాళిదాసుం గలసికొని యావృత్తాంత మతని కెఱింగించెను. అతడు చిత్రకారునితో నిట్లనియ. "ఓయీ! లీలావతీదేవి పద్మినీజాతిస్త్రీ, ఆజాతిస్త్రీలకు తప్పక తొడమీద బుట్టుమచ్చయుండును. ఆ పుట్టుమచ్చ నీవువేయుట మఱచితివి గావున మొగముమీద నీవుపెట్టిన కస్తూరితిలకము తొడమీదబడి పుట్టుమచ్చ యగుచున్నది. ఈ పర్యాయము మరల విగ్రహముయొక్క నుదుటను నీవు కస్తూరితిలకము పెట్టుము. అది తొడమీద బడును. తొడమీదనుండి దానిని దుడిచివేయక కస్తూరి తిలకము మరల లలాటమున బెట్టుము అది పడిపోక నిలుచును" అని యుపదేశింప కొత్రలారిడు మిక్కిలి సంతోషించి కాళిదాస మహాకవి చెప్పినట్లు వేసినతొడనే బొమ్మయొక్క ఫాలభాగమునందు దిలకము నిలిచెను. నిలిచినతోడనే చిత్రకారుడు తనజన్మము సఫలమయినదని, తనవిద్య