163
కాళిదాస చరిత్ర
నీవంట యపవిత్రము. ఈనూతిలొనినీళ్లపవిత్రము, ఈ శ్రాద్దమపవిత్రము నేనిప్పుడు పరిశుభ్రమైనజలము దెప్పించెద దానితో వంటచేయింపుము" అని ఆకాశగంగ నీవిధముగా స్తనము జేసెను.
శ్లో॥ గంగాం వందేజగద్వంద్యాం క్షీరసాగరకామీనీం
భగీరధ సమానీతాం, విష్ణుపాదసముద్భావం
అట్లు స్తనము చేయంగానే కుంభవృష్టిగా వర్షము గురిసినట్లు దివ్యగంగ యాకాశమునుండి దిగి వానియింట బ్రవహించెను. ఆజలముతో నందఱకు స్నానముచేయించి వంట దానితొ జేయించి శ్రాద్ధము జరిపింపుమని కాళిదాసుడు చెప్పెను. అప్పుడు కాళిదాసుని ప్రభావముచేత బితృదేవతలు పితృలోకము నుండి ప్రత్యక్షముగా దిగివచ్చి భోక్తల ముఖమున గాకుండ స్వయముగా భుజించిరి. కాళిదాస ప్రభావమునకు దక్కినభోక్తలు, చుట్టములు, భ్రాహ్మణకుమారుండు మిక్కిలి యాశ్చర్యమునొంది యతడు సాక్షాత్పరమేశ్వరుడె యని స్తముచేసి యాతనిప్రభావము దెలియక మొదటవాడిన దురూక్తులను సైరింపుమని పాదములపై బడి ప్రార్దించిరి.
పు ట్టు మ చ్చ
మిక్కిలి నేర్పరియైన
యొక చిత్రలేఖకుడు
భోజమహరాజు దర్శనముచేసి తన ప్రజ్ఞావిశేషము నిట్లు చెప్పుకొనెను.
"దేవా! చిత్రలేఖమునందు నేనద్వితీయుడను ఆత్మస్తుతి యనుచితమైనను నరుడు తన్నెఱుగని చొటుల దన ప్రజ్ఞాదికము జెప్పుకొనవలసియుందును
లోకమునందలి విచిత్రకాఱులందఱు దాము చిత్తరువు వ్రాయవలసిన మనుష్యుని విగ్రహమును గనులార జూచిగాని వ్రాయంజాలరు. నేనో, యట్టి మనుష్యరూపమును, జూడనక్కఱలేకయే తలవెంట్రుకను జూచి, దానింబట్టి యచ్చముగనున్న రూపు వ్రాయగలను.