ఈ పుటను అచ్చుదిద్దలేదు
135
కాళిదాస చరిత్ర
చున్న యా నలుపును రాతియందు చంద్రుడు మ్రింగి వైచి కడుపులో నిల్చిన చీకటియని తలంచెదము.(కాళిదాసుడు)
ఉత్తరార్ద మతిమనోహరముగా నుండుటచే భోజుడు సంతొషించి చంద్రుని గళమకరహితముగా వర్ణింపుమని యతనిని గొరెను. కాళిదా సిట్లు వర్ణించెను.
శ్లో॥లక్ష్మీకిదాతటాళో, ధనశిరు చిగ్నహం, దర్పణం
దిగ్వధూనాం
పుష్పం శ్యామాలతాయా, స్త్రీభువనజయినో మన్మధ
స్వాతపత్రం
పిండీభూతం హరస్యస్మిత, మరధునీపుండరీకం,
మృగాంకో
జ్యోత్స్నా పీయూషవాసీం జనయతి, నికరి స్తార
కాగోళకానాం
తా॥ ఈ చంద్రమండలము లక్ష్మీదేవియొక్క్స క్రీడాసరస్సు, తెల్లని కాంతికి నిలయము, దిక్కులనెడు స్త్రీల యుద్ధము, రాత్రియనెడు తీగను బూసిన పువ్వు, ముజ్జగములను జయించునట్టి మన్మధుని గొడుగు, ముద్దగా జేయబడిన శివుని నవ్వు, ఆకాశగంగలో మొలచిన తెల్ల తామరపువ్వు, చుక్కలనెడు గుండ్లయొక్క సమూహమునై వెన్నెల యనెడు నమృతపుబావిని గల్పించుచున్నది.
కవులు నిరంకుశులగుటచేత నేవస్తువునైనను మంచిదిగాను, వారి యిచ్చాప్రకారము వర్ణింపగలరు కనుకనే కాళిదాసుండు చంద్రుని గళంకసహితుని గాను, కళంకరహితునిగాను వర్ణించి యున్నాడు. ఆ రెండువర్ణనలు విని రాజు పరమహర్షమునొంది గొప్ప బహుమానము చేసెను.
పం డి త ప్ర యో గ ము
కాళిదాసుమీద భోజమహారాజు
నకు మిక్కిలి యనురాగము గలిగి
యుండుటచే విద్వద్బృంద మాకవిమీద నసూయ బూని యతని కెట్లయిన నపకారము సేయదలచిరి. రాజుయొక్క యంతరపు