పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
133]

183

కాళిదాస చరిత్ర

శ్లో॥భారతం చేశీఖండంచ సముద్రమపి వర్ణయ,

తా॥ఆవర్ణించుటలోమూడింటియందు గలవిశేషముల నొక్కమాటలో జెప్పవలయునని కోరెను. కాళిదాసు డిట్లు వర్ణించెను.

పాదేనైకేననక్ష్యామి ప్రతిసర్వరసోదయం

తా॥ఒక్కపాదములోనే చెప్పెదను. ప్రతి పర్వమునందు రసోదయము కలుగును.

 అనగా భారతమందలి ప్రతిపర్వమునందును రసమున్నది. సర్వమనగా కణుపునకర్ధమున్నదిగనుక చెఱుకునకు ప్రతిపర్వమున రసమున్నది. పర్వమనగా నమావాస్య, పున్నమి మొదలగువానికిగూడ నర్ధమున్నది. కనుక సముద్రమున బ్రతిపర్వమునందు రసోదయము కలుగును. అనగా పొంగును.  ఆపర్వశబ్ధప్రయోగముచేత భోజుడు మహానందభరితుడై  కజ్ళిదాసువంటి రసపుష్టిచేయగలకవి మ్ఱియొకడు లేడని స్తుతించెను. 

భీ భి

భొజ రాజు

తనదేశమున

గలప్రజల సౌఖ్యము ఆనరయుటకై గ్రామములవెంట సంచరించుచుండ నతనికొకసారి విశేషదాహమయ్యెను. సమీపముననున్న నదికడకు బోయి యతడు దాహశాంతి చేసికొనెను. ఆ నదిలో నొకమూల చాకలి వాడు ఱాతిపై బట్టలుతుకుచు శ్రమ నివాణార్ధముగ నేదో యొకమాటననుకొను చుండవలెనని భీభిభి యనుచుండెను. భోజుడచ్చట గొంతసేపు నిలువంబడి యాశబ్ధమువిని పట్టణమునకుబోయినతరువాత గాళిదాసుని బిలిచి యీక్రిందిసమస్య నిచ్చెను:-

భీభిబి భీబీ:” 
 అద్భుతమైన యాసమస్యను సకలహాస్యవేదికయైన కాళిదాసు డిట్లు పూరించెను: