Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
132

కాళిదాస చరిత్ర

బట్టుకొనవలెనని నిశ్చయించి నిరంతరము తాను పల్లకినెక్కి దేశముల వెంబడి దిరుగజొచ్చెను. ఎన్నడైన దైవవశమున గాళిదాసుడు బోయయై చచ్చి తనపల్లకి మోయునేమోయని శంకించి యతడు బోయగా నున్నను దనమాటకు ప్రత్యుత్తర మీయపోడని తఱుచుగా నీ క్రింది శ్లోకార్దము బఠించుచుండును.

శ్లో॥అయ మాందోళికాదండ స్తన బాధతి కం భుతౌ

      తా॥పల్లకిదండి నీభుజములను భాదించు చున్నదా? పల్లకి పల్లకి మోయు బోయలు సాధరణముగా విద్యావిహీనులే గావున రాజిచ్చు యా ప్రశ్నకు కెవ్వరు నుత్తరమీయలేరు. దైవవశమున నొకనాడు కాలిదాసుడే రాజు పల్లకి మోయవలసి వచ్చెను. భోజుడు యధాప్రకారముగా మొదటిప్రశ్నము బోయలనడిగెను. బోయగానున్న కాళిదాసుడు వెంటనే యిట్లుత్తరమిచ్చెను.

శ్లో॥నాయ మాందోళికాదండ స్తన బాధతి బాధతే

      తా॥పల్లకి దండి నన్నంతగా బాధించుటలేదు. కాని, 'బాధతి యని నీవుచేసిన తప్పుప్ర;యోగము  నన్ను బాధించుచున్నది.

      అక్కడి క్రియాపదము 'బాధతే ' యని యుండ వలయుంగాని 'బాధతి ' అని యుండగూడదు. అప శబ్ద ప్రయోగమే కర్ణకఠోరమగుటచే మహాకవి యూర కుండజాలక ప్రత్యుత్తరమిచ్చెను. ఆ యుత్తరము విని బోయలలో దప్పక కాళిదాసున్నాడని తెలిసికొని భోజుడు పల్లకినుండి దుమికి కాళిదాసుం బోల్చిచూచి పారములపైబడి నమస్కరించి బతిమాలి తనవెంట గొనిపోయెను.

ప ర్వ ము

భోజధారుణీశ్వరు

డొ క నా డు

కాళిదాసుని జూచి భారతమును, చెఱుకుగఱ్ఱను, సముద్రమును వర్ణింపుమని యీ క్రింది విధముగా నడిగెన్