పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
122

కాళిదాస చరిత్ర

పెండ్లిచేయుదును" అనవుడు బ్రహ్మచారి యిట్లనియెను. "రాజా! నీవు ప్రభువవు, నీ కసాధ్యమెమున్నది? అయినను నిది వినుము;

శ్లో॥సారంగా: సుహృదో, గృహంగరిగ్నహా, శాంతిప్రియా
     గేహినీ,
     వృత్తి ర్వస్యలతాఫలై, ర్నివసనం శ్రేష్టం తిరూగాం
     త్వచ,
     సద్వాక్యామృతఊరమగ్నమనసాం యేషా మియం
     నిర్వృతి:
     న్తేషా మిందుకళావతంసయమినాం మోక్షే పి నో
     నస్సృహా.

      తా॥ ఏ మహామునులకు జింకలు మిత్రములో, గృహము పర్వతగృహమో, సియభార్య శాంతియో, జీవనము వసలతాఫలములో వస్త్రము చెట్లయొక్క పట్టలో, అట్లే  ప్రియవాక్య్తామృతముగల యోగులకు మోక్షముమీద సైతము కాంక్షలేదు.
     మేమువట్టియోగులమేనుక మాకుధనకనక వస్తువాహనములపై కాంక్షలేదు. కాని, మిమ్మొకకోరిక కోరుచున్నాను. పండితగొష్ఠి చేసికొనుచు బ్రయాణముచేయుట మిక్కిలి సుఖప్రదమూ అనెను.
    అదివిని రాజు భక్తితత్పరుడై యతనిపాదములకు నమస్కరించి తన యాస్దానకవులను, పండితులను వానివెంట బొమ్మని యానితిచ్చెను: కవిపండితులందఱు వానివెంట జనిరి.
  కాళిదాసుడుమాత్రము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని రాజాతనిని నడిగెను. కాళిదాసుడిట్లు బదులుచెప్పెను. "మీరు సర్వజ్ఞలు మీకే తెలుసును-

శ్లో॥తేయాంతి తీర్ధషుబుధా యే శంభోర్ధూరవర్తను
     యన్య గౌరీశ్వర శ్చిత్తే తీర్ధం భోజ సరం హిమ"

   తా॥రాజా! ఎవరు శంభునకు దూరమైపోదురో, వారే తీర్దయాత్రలకు పోదురు. ఎవనిమనస్సునందు గౌరీపతియుండునో వానిదే యుత్తమతీర్దము.