పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

123

కాళిదాస చరిత్ర

  తీర్ధయాత్రలు నిష్పలములనీ పైశ్లోకముచే గాళిదాసు చెప్పినందుకు రాజు మనంబున గనిసి తనయాౙ్నానుసార మతడు కాశికి బోవలేదని కోపించి నిరంతర వేశ్యాలోలుడగు నాతని మునుపటివలె గౌరవింపక సావమానముగా జూచెను. రానానుగ్రహము తనపై మునుపటివలె లేదని కాళిదాసు విచారించి యతని యాస్థానమును విడిచి యల్లాళదేశమునకు బోయి దాని పరిపాలకునిజూచి—“రాజా! మాళవేద్రుడైన భోజుని యాస్థానకవిని  నాపేరు కాళిదాసుడు అతడనాదరణము చేయుటచే మీయాస్థానముననుండ వచ్చితిని“ అనివిన్నవించెను. అనవుడల్లాళరాజు “సుకవీ! భోజసభనుండివచ్చిన పండితులవలన నీకీర్త్ పలుమారులు వింటిని. నీవు సరస్వతీదేవియొక్క యపరావతారమట. నీనోటనుండి యేదేని వినగోరుచున్నాను.” అనిపలికెను. కాళిదాసుడు వామిప్రతాపము నీక్రిందిశ్లోకముతో వర్ణించెను.

శ్లో॥ అల్లాళక్షోణిపాలత్వదహితనగరే సంచరతీ కిరాతీ
    కీర్ణా నాదాయా రత్నా న్యురుతరఖదిరాంగారశంకాకులాంగీ
    క్షిస్త్వా శ్రీఖండం తదుపరి ముకుళిభూతనేతో ధమన్తీ
    శ్వాసామోదానుయాతైర్మధుకరనికరై రూమశంకాం విభర్తి.

తా॥ఓ యల్లాళరాజా, నీవునాశనముచేసిన శత్రురాజ పట్టణమందు చెంచుపడతియొకటి తిరుగుచు నక్కడక్కడ బడియున్నరత్నములను బ్రోగుచేసి యవి యెఱ్ఱనిచండ్రనిప్పులనుకొని మంటచేయుటకై వానిపై మంచిగంధపుపెళ్లువైచి కన్నులుమూసికొని యాడుచుండెను. దానిశ్వాసయొక్క సుగంధమునకై యచ్చటజేరిన తుమ్మెదగుంపు పొగవలె నుండెను.

  ఆశ్లోకమువిని యల్లాళరాజు వానికక్షరలక్షలిచ్చెను. బహువిధశ్లోక రచనలచేత నారాజును సంతోషపెట్టుచు, కాళిదాసచ్చటనే కొంతకాలముండగా, భోజరాజుకవిలోకసారభౌముడగు కాళిదాసుని